హాస్టల్ వసతి కల్పించాలి..
కేయూ క్యాంపస్ : హాస్టల్ వసతి కల్పించాలని కాకతీయ యూనివర్సిటీ ఐదేళ్ల ‘లా’ కోర్సు విద్యార్థులు డిమాండ్ చేశారు. ఈమేరకు సోమవారం క్యాంపస్‌లోని పరిపాలన భవనం వద్ద ధర్నా నిర్వహించారు. హాస్టల్ వసతి కల్పించకపోవడంతో తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. ఇప్పటికే పలుమార్లు యూనివర్సిటీ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా సమస్యను పరిష్కరించడం లేదన్నారు. ఇప్పటికై నా వెంటనే వసతి కల్పించాలని డిమాండ్ చేశారు. ధర్నా విషయం తెలుసుకున్న రిజిస్ట్రార్ రామచంద్రం, హాస్టళ్ల డైరెక్టర్ రాజ్‌కుమార్ ఘటనాస్థలికి చేరుకున్నారు. విద్యార్థులకు నచ్చజెప్పే యత్నం చేసినా పట్టించుకోలేదు. ఉదయం 11.30 నంచి సాయంత్రం 6గంటల వరకు ఆందోళన కొనసాగించారు. మరోసారి రిజిస్ట్రార్ రామచంద్రం.. పలువురి విద్యార్థులను చాంబర్‌కు పిలించుకుని మాట్లాడారు. వీసీ ప్రతాప్‌రెడ్డి మంగళవా రం యూనివర్సిటీకి రానున్నారని, ఆయన దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించేందుకు కృషిచేస్తామని తెలిపారు. సమస్యను వీసీ దృష్టికి కూడా తీసుకెళ్లామని, ఇప్పుడు హాస్టల్ వసతి కల్పిస్తామని స్ప ష్టంగా ప్రకటిస్తేనే ఆందోళన విరమిస్తామని, లేనిపక్షంలో కొనసాగిస్తామని విద్యార్థులు తెలిపారు. స్టా లిన్, రంజిత్‌కుమార్, సందీప్, అరుణ్, రాకేశ్‌రెడ్డి, శ్రీను, ఆదిత్య, రోహిత్, ప్రదీప్, శివాజీ, యాకూ బ్, దిశా,రణధీర్, శరత్ పాల్గొన్నారు.
ఐదేళ్ల ‘లా’ కోర్సు విద్యార్థుల డిమాండ్
పరిపాలన భవనం వద్ద ధర్నా


