తేలిన లెక్క..
మహబూబాబాద్: రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ఉపసంహరణ ప్రక్రియ ఈనెల 6న మధ్యాహ్నం 3 గంటలలోపు పూర్తయ్యింది. కాగా, బరిలో ఉన్న అభ్యర్థుల జాబితాను ఆదివారం అధికారులు వెల్లడించారు. 158 సర్పంచ్ స్థానాలకు15 జీపీలు ఏకగ్రీవం కాగా.. 143 సర్పంచ్ స్థానాల్లో 475 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. కాగా, 1,358 వార్డులకు గాను 251ఏకగ్రీవం కాగా.. మిగిలిన 1,107వార్డుల్లో 2858 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
ఈనెల 14న పోలింగ్..
ఈనెల 14వ తేదీన ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి వరకు రెండో విడత ఎన్నికల పోలింగ్ ఉంటుంది. అదే రోజు మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తి చేసి అదే రోజు ఫలితాలను ప్రకటిస్తారు. ఫలితాలు వెలువడిన వెంటనే ఉపసర్పంచ్ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు.
రెండో విడత జీపీ ఎన్నికల దరఖాస్తుల ఉపసంహరణ
15 గ్రామ పంచాయతీలు, 251వార్డులు ఏకగ్రీవం
143 సర్పంచ్ స్థానాల్లో 475 మంది అభ్యర్థులు
1,107 వార్డుల్లో బరిలో 2,858మంది..
ఈనెల 14న పోలింగ్
మండలం జీపీలు ఏకగ్రీవం మిగిలిన బరిలో ఉన్న
జీపీలు అభ్యర్థులు
బయ్యారం 29 01 28 106
చిన్నగూడూరు 11 02 09 24
దంతాలపల్లి 18 02 16 46
గార్ల 20 02 18 60
నర్సింహులపేట 23 01 22 63
పెద్దవంగర 26 06 20 70
తొర్రూరు 31 01 30 106
మొత్తం 158 15 143 475
బరిలో ఉన్న వార్డు అభ్యర్థులు
మండలం వార్డులు ఏకగ్రీవం మిగిలిన అభ్యర్థులు
వార్డులు
బయ్యారం 251 28 223 609
చిన్నగూడూరు 95 30 65 174
దంతాలపల్లి 166 39 127 331
గార్ల 184 43 141 382
నర్సింహులపేట 194 38 156 367
పెద్దవంగర 192 34 158 393
తొర్రూరు 276 39 237 602
మొత్తం 1,358 251 1107 2,858


