క్యాష్ ఇవ్వకుండానే కటింగ్ పెట్టాడు..
ఎకరం భూమిలో వరి పంట సాగు చేయగా, 20.55 క్వింటాళ్ల ధాన్యం చేతికి వచ్చింది. అమ్ముకుందామని వెళ్తుండగా ఓ వ్యాపారి ట్రాక్టర్‌ను ఆపి, వడ్లను తనకు అమ్మితే నగదు డబ్బులు ఇస్తానన్నాడు. క్వింటాకు రూ.2,370 రేటు పెట్టిండు. తర్వాత వేబ్రిడ్జిపై ట్రాక్టర్ లోడ్‌ను తూకం వేయించారు. తీరా తనకు నగదు డబ్బులు ఇవ్వకుండా, ఒకశాతం క్యాష్ కటింగ్ చేస్తున్నట్లు(రూ.479) రాసి, వారం తర్వాత వస్తే డబ్బులు ఇస్తానన్నాడు. నగదు ఇవ్వకుండా క్యాష్ కటింగ్ ఎలా పెడతారని అడిగితే, తాము అలాగే ఇస్తామంటూ వ్యాపారి నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చాడు. పై నుంచి తరుగు పేరుతో 30 కిలోల ధాన్యం కటింగ్ చేసి, కూలి పేరిట రూ.578 కట్ చేసి రిసిఫ్ట్ ఇచ్చాడు. ధాన్యాన్ని తిరిగి ఇంటికి తీసుకురాలేక నష్టానికే అమ్ముకున్నా.
–ఆరిద్రపు శ్రీనివాస్, రైతు, అమీనాపురం


