రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
ధర్మసాగర్: రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. ఈ ఘటన మండలంలోని ఉనికిచర్ల శివారులో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. ధర్మసాగర్ మండల కేంద్రానికి చెందిన ల్యాగ రాజయ్య కుమారుడు యోగేశ్వర్(21), తన స్నేహితుడు నిఖిల్ శనివారం అర్ధరాత్రి బైక్‌పై ధర్మసాగర్ నుంచి హనుమకొండకు వెళ్తున్నారు. ఈక్ర మంలో ఉనికిచర్ల దాటిన తర్వాత బైక్ అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న కల్వర్టులోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో యోగేశ్వర్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. నిఖిల్‌కు గాయాలయ్యాయి. మృతుడి తండ్రి రాజయ్య ఫిర్యాదు మేర కు కేసు నమోదు చేసి ద ర్యాప్తు చేస్తున్నట్లు శ్రీధర్ రావు తెలిపారు.


