కేంద్ర ప్రభుత్వం నుంచి..
ఐదేళ్లకోసారి కేంద్ర ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు కేంద్ర ప్రభుత్వం నేరుగా గ్రామ పంచాయతీల ఖాతాల్లోకి గ్రాంట్లు బదిలీ చేస్తుంది. ఇవి పారిశుద్ధ్య, మౌలిక వసతుల కల్పనకు ఉపయోగపడతాయి. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వా రా గ్రామాల్లో అభివృద్ధి పనులకు కూలీల వేతనాలకు నిధులు అందుతాయి. స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా గ్రామ పారిశుద్ధ్యం, ఘన వ్యర్థాల నిర్వహణకు నిధులు కేటాయిస్తారు. ప్రధాన మంత్రి సడక్ యోజన వంటి పథకాలతో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి, రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరవుతాయి. కేంద్ర ప్రభుత్వం 2019లో ప్రారంభించిన జల్‌జీవన్ మిషన్ ద్వారా శుద్ధమైన తాగునీటి సరఫరాకు నిధులు విడుదల చేస్తోంది.


