జీపీలకు నిధులు ఇలా..!
వర్ధన్నపేట: తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుండగా, త్వరలో పాలక వర్గాలు కొలువుదీరనున్నాయి. ఈ క్రమంలో గ్రామాల్లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు నిధులు అవసరం. ఆ నిధులు ఎలా వస్తాయి? ఎవరు ఇస్తారు? అనే అంశాలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.
పంచాయతీలకు
ఆదాయ వివరాలు.
పంచాయతీలకు మూడు రకాల ఆదాయం లభిస్తుంది. మొదటిది పంచాయతీలు సొంతంగా వనరులు సమకూర్చుకుంటాయి. రెండోది కేంద్రం, మూడోది రాష్ట్ర ప్రభుత్వం గ్రాంట్లు విడుదల చేస్తాయి.
సొంత వనరులు..
పంచాయతీ ఖర్చులను మూడు రకాలుగా పరిశీలించొచ్చు. కార్యాలయ నిర్వహణ, పాలన.. రోడ్లు, డ్రైయినేజీ, వీధి దీపాలు, పచ్చదనం నిర్వహణ.. సామాజిక కార్యక్రమాలకు నిధులు వ్యయం చేస్తారు. ప్రజలు కేంద్ర ప్రభుత్వం ఈ –గ్రామ స్వరాజ్ పోర్టల్ ద్వారా పంచాయతీకి కేటాయించిన బడ్జెట్, ఖర్చుల వివరాలు, ఆడిట్ నివేదికను సులభంగా పరిశీలించొచ్చు. ఇది గ్రామాభివృద్ధిలో జవాబుదారీతనం పెంచుతుంది.
రాష్ట్ర ప్రభుత్వం నుంచి..
రాష్ట్ర ప్రభుత్వం గ్రామపంచాయతీలకు స్టాంప్ డ్యూటీ వాటా చెల్లిస్తుంది. భూములు కొనుగోలు, రిజిస్ట్రేషన్ ద్వారా వచ్చే స్టాంప్ డ్యూటీలో కొంత వాటా అందిస్తుంది. రాష్ట్ర ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు అభివృద్ధి, నిర్వహణ, ఖర్చుల కోసం ప్రభుత్వ సాధారణ గ్రాంట్లు విడుదలవుతాయి. ప్రత్యేక అవసరాల కోసం ముఖ్యమంత్రి హామీలు అమలుకు ఇతర కార్యక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుంది.
పంచాయతీలకు
మూడు రకాల ఆదాయం
సొంత వనరులకు తోడు కేంద్ర,
రాష్ట్ర ప్రభుత్వాల గ్రాంట్లు
ఆ నిధులతోనే మౌలిక,
సామాజిక వసతుల కల్పన
ఈ –గ్రామ స్వరాజ్ పోర్టల్ ద్వారా
వివరాలు తెలుసుకోవచ్చు


