పల్లెను మాట్లాడుతున్నా! | - | Sakshi
Sakshi News home page

పల్లెను మాట్లాడుతున్నా!

Dec 8 2025 7:41 AM | Updated on Dec 8 2025 7:41 AM

పల్లెను మాట్లాడుతున్నా!

పల్లెను మాట్లాడుతున్నా!

తొర్రూరు: సుమారు రెండేళ్లుగా పాలకవర్గాలు లేక చతికిలబడిన పల్లెను నేను. ఇప్పటి వరకు పాలనను నడిపించిన పంచాయతీ కార్యదర్శులను, ప్రత్యేక అధికారులను నేను తక్కువ చేసి మాట్లాడడం లేదు. అవసరాల మేరకు నిధులు మంజూరు కాక, చేసిన పనులకు బిల్లులు రాక కాంట్రాక్టర్లు కొత్త పనులు చేయడానికి ముందుకు రాని పరిస్థితి. ఇప్పటివరకు ఎలాగోలా కార్యదర్శులు పరిపాలన చేసినా..ప్రజా ప్రతినిధులను తమ సమస్యలపై నిలదీసినట్లుగా ప్రజలు వారిని నిలదీయలేరు.

● అధికారుల కన్నా ప్రజాప్రతినిధులు స్థానికంగా ఉంటారు. తమను ప్రజలు నిలదీస్తారనే ఆలోచనతోనైనా సమస్యల పరిష్కారంపై ఎక్కువ దృష్టి సారిస్తారు. కార్యదర్శులు తమకున్న అధికార పరిధిలోపే పని చేస్తారు. స్థానిక ప్రజాప్రతినిధులైతే ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రులను కలిసి తమ సమస్యలను వివరించి ప్రత్యేకంగా నిధులు రాబట్టే వీలుంటుంది. పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వ నిధులతో పాటు దాతలను సంప్రదించి ప్రాథమిక విద్యావసరాలను అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉంది.

● ప్రభుత్వం నుంచి నిధుల మంజూరులో జాప్యం జరిగినా వార్డు సభ్యుడు, సర్పంచ్‌ వరకు తమ పలుకుబడిని ఉపయోగించి కనీస అవసరాలు తాగునీరు, వీధిదీపాలు, మురుగు కాల్వల నిర్మాణం, నిర్వహణ, అంతర్గత రహదారుల నిర్మాణం వంటి పనులు చేపట్టగలరు. రైతుల పంట ఉత్పత్తుల క్రయ,విక్రయాల్లో సమస్యలు రాకుండా ఉన్నతస్థాయి అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చొరవ చూపుతారు. వృద్ధులు తమ ఆరోగ్య సమస్యల నుంచి, పింఛన్ల పంపిణీలో తలెత్తే సమస్యల వరకు ప్రజాప్రతినిధులపై నమ్మకంతోనే వారిని సంప్రదిస్తుంటారు.

● పల్లెల్లో పంచాయతీ పాలకవర్గాల ఎన్నికలకు మార్గం సుగమం అయినందుకు సంతోషంగా ఉంది. కొత్తగా వచ్చే పాలకవర్గాలు తమను ఎ న్నుకున్న ప్రజల మనోభావాలను అర్థం చేసుకు ని, నెలకొన్న సమస్యలకు పరిష్కారం చూపి, క నీస వసతులు కల్పించి పల్లెల సర్వతోముఖాభివృద్ధికి దోహదపడేలా ఉండాలని నేను ఆకాంక్షిస్తున్నా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement