విచిత్ర పొత్తులు!
దుగ్గొండి: మండల వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. నామినేషన్ల విత్‌డ్రాలు ముగిశాయి. సర్పంచ్, వార్డు పదవులకు పోటీ చేసే అభ్యర్థులకు గుర్తులు వచ్చాయి. ఇక ఎలాగైనా గెలుపొందాలని గ్రామాల్లో పార్టీల మధ్య విచిత్ర పొత్తులు చిగురించాయి. అడవిరంగాపురం గ్రామంలో ఎంసీపీఐ(యూ)–బీఆర్‌ఎస్ మధ్య పొత్తు కుదరగా, రేబల్లెలో కాంగ్రెస్–ఎంసీపీఐ(యూ) పార్టీల మధ్య పొత్తు కుదిరింది. సీపీఎం నాచినపల్లిలో కాంగ్రెస్‌తో పొత్తు కుదుర్చుకోగా.. రేకంపల్లి, తిమ్మంపేట, తొగర్రాయి గ్రామాల్లో బీఆర్‌ఎస్‌తో పొత్తు కుదుర్చుకుంది. మందపల్లి గ్రామంలో సర్పంచ్‌గా లింగాల సుమలత కాంగ్రెస్ మద్దతుతో పోటీచేస్తుండగా, కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి మారేడుగొండ శ్రీమాలతి స్వతంత్ర అభ్యర్థిగా పోటీపడుతున్నారు.
సర్పంచ్ బరిలో అన్న, చెల్లి..
బయ్యారం: మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం వెంకటాపు రం సర్పంచ్ పదవికి అన్న, చెల్లి బరిలో నిలిచారు. కాంగ్రెస్ మద్దతుతో బొర్ర కృష్ణ, బీఆర్‌ఎస్ అభ్యర్థిగా అతడి చెల్లి పొడుగు సుగుణ పోటీ పడుతున్నారు. ఇరువురు తమ గెలుపు కోసం ప్రచారం నిర్వహిస్తుండగా, విజయం అన్నను వరిస్తుందో చెల్లిని వరిస్తుందో ఈ నెల 14న వెల్లడికానుంది.
ఉప సర్పంచ్‌పై
రాష్ట్ర నాయకుల గురి
● వార్డు సభ్యులుగా బరిలోకి..
సంగెం: మండలంలోని వంజరపల్లి ఉప సర్పంచ్ పదవిపై రాష్ట్ర నాయకులు గురిపెట్టారు. వంజరపల్లిలో ఎస్టీ జనాభా లేకపోవడంతో సర్పంచ్, 3 వార్డులకు నామినేషన్లు దాఖలు కాలేదు. ఇక్కడ 5 వార్డుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో 3వార్డులు కై వసం చేసుకుంటే ఉపసర్పంచ్ ఖాయం. ఉప సర్పంచ్‌తోనే పాలన కొనసాగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ మద్దతుతో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్ మోర్తాల చందర్‌రావు 5వ వార్డు సభ్యుడిగా, బీఆర్‌ఎస్ మద్దతుతో తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు సోమిడి శ్రీనివాస్ తన భార్య వసంతను 3వ వార్డు నుంచి పోటీలో నిలిపారు. కాగా, అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఉప సర్పంచ్ పదవి ఎవరిని వరిస్తుందో వేచి చూడాల్సిందే.
విచిత్ర పొత్తులు!


