నేటి నుంచి ప్రత్యేక రైళ్లు
కాజీపేట రూరల్ : ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని కాజీపేట జంక్షన్ మీదుగా సోమవారం నుంచి చర్లపల్లి–నిజాముద్దీన్ మధ్య రెండు ప్రత్యేక రైళ్ల సర్వీస్‌లను నడిపిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎ.శ్రీధర్ ఆదివారం తెలిపారు.
ప్రత్యేక రైళ్ల వివరాలు..
డిసెంబర్ 8వ తేదీన చర్లపల్లి–హజ్రత్ నిజాముద్దీన్ (07021) ఎక్స్‌ప్రెస్ కాజీపేట జంక్షన్‌కు సోమవా రం 23.45 గంటలకు చేరుకుని వెళ్తుంది. డిసెంబర్ 10వ తేదీన హజ్రత్ నిజాముద్దీన్–చర్లపల్లి (07 022) ఎక్స్‌ప్రెస్ కాజీపేట జంక్షన్‌కు మరుసటి రోజు 04.30 గంటలకు చేరుకుని వెళ్తుంది. ఈ రైళ్లకు కాజీపేట, రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి, సిర్పూర్‌కాగజ్‌నగర్, బల్లార్షా, నాగ్‌పూర్, ఇటార్సీ, భోపాల్, బీనా, ఝాన్సీ, గ్వాలియర్, ఆగ్రా జంక్షన్లలో హాల్టింగ్ కల్పించారు.
ప్రీమియం రైళ్లకు ఓటీపీ బేస్డ్ తత్కాల్ రిజర్వేషన్
కాజీపేట రూరల్ : రైల్వే శాఖ ఈనెల 5వ తేదీ నుంచి ప్రీమియం రైళ్లకు ఓటీపీ బేస్డ్ తత్కాల్ రిజర్వేషన్ టికెట్ సిస్టమ్‌ను అమలు చేస్తోందని రైల్వే అధి కారులు ఆదివారం తెలిపారు. కాజీపేట, వరంగల్ మీదుగా ప్రయాణించే హజ్రత్ నిజాముద్దీన్–బెంగళూరు, బెంగళూరు–హజ్రత్ నిజాముద్దీన్ రాజధాని ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్–హజ్రత్ నిజాముద్దీన్, హజ్రత్ నిజాముద్దీన్–సికింద్రాబాద్ రాజధాని ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్–విశాఖపట్నం, విశాఖపట్నం–సికింద్రాబాద్ దురంతో ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్–నాగ్‌పూర్, నాగ్‌పూర్–సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్–విశాఖపట్నం, విశాఖపట్నం–సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్, హంసఫర్ ఎక్స్‌ప్రెస్‌కు వన్–టైం పాస్‌వర్డ్ (ఓటీపీ )బేస్డ్ తత్కాల్ రిజర్వేషన్ టికెట్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టిందని తెలిపారు. ప్రీమియం రైళ్లకు తత్కాల్ రిజర్వేషన్ చేసుకునే ప్రయాణికులు రిజర్వేషన్ చేసుకునే సమయంలో సెల్ నంబర్‌నుకు వచ్చే ఓటీపీని చెప్పితేనే టికెట్ జారీ చేయనున్నట్లు అధి కారులు తెలిపారు.


