‘నోటా’ సంగతేంటి
‘నోటా’ గుర్తు ఎవరిని ముంచుతుందో వేచి చూడాలి. అభ్యర్థులకు ఓటు వేయొద్దని భావించే ఓటర్లు నోటాను ఎంచుకోవచ్చు. అభ్యర్థుల ప్రచారంలో నోటాపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ‘అన్నా ఓటు మాత్రం చిత్తు చేయకు.. బ్యాలెట్ పత్రంలో చివర ఉన్న నోటాకు మాత్రం వేయకు’ అంటూ వేడుకుంటున్నారు. అసలే అంతుపట్టని గుర్తులతో ఓ పక్క ఆందోళనకు గురవుతుంటే, నోటాతో తంటాలు తప్పవనే భావనలో ఉన్నారు. ముద్ర వేసి మద్దతు తెలపాల్సిన ఎన్నికల్లో ‘స్టాంప్’ కొంచె అటు ఇటూ అయినా చెల్లకుండా పోతుంది. గతంలో మన గుర్తు పై మధ్య, చివరన అని చెబుతూ ఓటు వేయాలని ప్రచారం చేసే వారు. ఇప్పుడు కొత్తగా చివరన నోటా రావడంతో చివరి గుర్తులు వచ్చిన అ భ్యర్థులు ఏమని చెప్పుకోవాలో తెలియక, కింద నుంచి రెండోదంటూ పదేపదే ఓటర్లకు వివరిస్తున్నారు.


