సర్పంచ్ ఏకగ్రీవానికి రూ.50 లక్షల ఆఫర్
మూడు రోజుల ముందే ‘అడ్వాన్స్’ పేమెంట్స్..
ఎన్నికల బరిలో మూడో తరం..
హసన్‌పర్తి: హసన్‌పర్తి మండలం జయగిరిలో సర్పంచ్ పదవికి ఆఫర్ ఇచ్చారు. శనివారం నామినేషన్ల ఉపసంహరణ గడుపు ఉండడంతో సర్పంచ్‌గా ఏకగ్రీవంగా అవకాశం ఇస్తే రూ.50 లక్షలు గ్రామాభివృద్ధికి ఖర్చు చేస్తానని స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్న న్యాయవాది తాళ్లపల్లి వెంకటేశ్ ప్రకటించారు. దీనిపై గ్రామ రచ్చబండ వద్ద సమావేశం జరగగా పోటీలో ఉన్న పల్లె దయాకర్ (అధికార పార్టీ అభ్యర్థి), కొంగటి మొగిలి, బొజ్జ అశోక్, పిట్టల రాజు అక్కడికి చేరుకున్నారు. న్యాయవాది ఆఫర్ ప్రకటించడంతో ఎక్కువ వేలం పాడిన వారికే ఏకగ్రీవం చేస్తామని స్థానికులు చెప్పారు. ముందుకు ఎవరు రాకపోవడంతో తాళ్ల వెంకటేశ్ వైపు స్థానికులు మొగ్గు చూపారు. ఇందుకు నామినేషన్ వేసిన వారు కూడా అంగీకరించారు. దీంతో వెంకటేశ్ ఒప్పంద పత్రాన్ని సిద్ధం చేశారు. ప్రస్తుతం డబ్బులు అందుబాటులో లేవని, దీనికి బదులు గ్రామంలో ఉన్న ఎకరం భూమిని పంచాయతీ కార్యాలయం పేర రాశారు. దీంతో పాటు పది ఖాళీ బ్యాంకు చెక్కులు సిద్ధం చేశారు. బరిలో ఉన్న వారందరినీ నామినేషన్ కేంద్రం(అన్నాసాగరం)కు రావాలని సూచించారు. దీంతో వెంకటేశ్, అనుచరులు నామినేషన్ పత్రంతో కేంద్రానికి చేరుకున్నారు. మిగతా మరో ముగ్గురు అక్కడకికి చేరుకుని ఉపసంహరణపత్రంపై సంతకాలు చేశారు. అయితే దయాకర్ మాత్రం నామినేషన్ కేంద్రానికి చేరుకోలేదు. నామినేషనల ఉపసంహరణ ఘట్టం ముగిసే వరకు కూడా పల్లె దయాకర్ అక్కడికి రాలేదు. దీంతో జయగిరిలో పోటీ అనివార్యమైంది.
లింగాలఘణపురం: ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో పోటీలో ఉన్న అభ్యర్థులు ఓటర్లకు ముందస్తుగానే ఓటు కోసం అడ్వాన్స్ చెల్లింపులు చేసినట్లు సమాచారం. మండలంలోని 21 పంచాయతీల్లో జనరల్ స్థానాల్లో పోటీ తీవ్రమవుతోంది. ఈ నెల 11న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మూడు రోజల ముందే ఓటర్లకు డబ్బులు పంచుతున్నారు. మండలంలోని ఓ జనరల్ స్థానంలో త్రిముఖ పోటీ నేపథ్యంలో ఓ సర్పంచ్ అభ్యర్థి ముందుగానే డబ్బులు పంచడంతో విధిలేని పరిస్థితుల్లో మిగతావారు కూడా ఎన్నికలకు మూడు రోజుల ముందే ముట్టజెప్పుతున్నారు. ప్రత్యర్థి ఎంత ఇస్తే అంతకంటే తగ్గేదేలే అన్నట్లు పోటీపడి డబ్బులు పంచుతున్నట్లు తెలిసింది. గతంలో ఎన్నడూ ఈ విధంగా లేదంటూ ఓటర్లే చర్చించుకుంటున్నారు.
ఓటంటే..
అచ్చంగా నీ వ్యక్తిత్వమే.
నిన్ను పట్టి చూపే ప్రతిబింబమే.
అభ్యర్థి ఏ పార్టీ వాడో కాదు
ఏ పాటి వాడో.. అన్నట్టుగా
ఐదేళ్ల పాటు
పల్లె గుండైపె ఎగిరే
సమున్నత నీతి పతాకం.
ఓటరంటే..
గ్రామాభివృద్ధికి జీవకర్ర.
తెల్లటి మనసున్న వాళ్లు
ఎన్నికలంటే
మన దారులను
మనం నిర్మించుకోవడమే.
ఓటరంటే..
నోటుకు ఓటు అమ్మని వాళ్లు
తాయిలాలకు
సొంగ కార్చని వాళ్లు,
చుక్కకో, ముక్కకో
ఓటును ముక్కలు ముక్కలు
చేయనివాళ్లు.
ప్రజాసామ్యం
ఫరిడవిల్లాంటే
ఓటు పవిత్రతకు
మనం కవచమై నిలబడాలి.
ఓటరూ
జర జాగ్రత్త!
ఓటు నీ పల్లె భవిష్యత్
డాక్టర్ పోరెడ్డి
ఏటూరునాగారం: ప్రస్తుత ఎన్నికల్లో ఏటూరునాగారం సర్పంచ్‌గా రెండు పర్యాయాలు విధులు నిర్వర్తించిన కుటుంబంలోని మూడో తరానికి చెందిన కాకులమర్రి శ్రీలతకు పోటీ చేసే అవకాశం వచ్చింది. ఏటూరునాగారం జీపీగా ఏర్పడిన సమయంలో తొలి సర్పంచ్‌గా కాకులమర్రి గోపాలరావు ఎన్నికయ్యారు. అనంతరం రెండోసారి గోపాలరావు కుమారుడు చక్రధర్‌రావు 1981లో సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. వారి ఇరువురి హయాంలో ఏటూరునాగారం అభివృద్ధి సాధించింది. చక్రధర్‌రావు కోడలు కాకులమర్రి శ్రీలత ప్రస్తుత ఎన్నికల్లో పోటీ చేస్తోంది. పూర్వీకుల చేసిన పాలన, అభివృద్ధిని స్ఫూర్తిగా తీసుకుని ఈ ఎన్నిల్లో బలమైన అభ్యర్థిగా బరిలో నిలవడం గమనార్హం.
ఓటు.. అమ్మితే చేటు
గ్రామ ఓటరు లా రా.. ఎన్నికల్లో డబ్బు, మద్యం వంటి ప్రలో భాలకు గురవకుండా నిజాయి తీ, అభివృద్ధి పట్ల నిబద్ధత గల వ్య క్తిని సర్పంచ్‌గా ఎన్నుకోవాలని ఓ యువజన కమిటీ ఆధ్వర్యంలో మహబూబాబాద్ మండలం గడ్డిగూడెం గ్రామంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని ఆసక్తిగా చూస్తున్న యువకుడు.
–సాక్షి ఫొటోగ్రాఫర్, మహబూబాబాద్
–న్యూశాయంపేట
జయగిరి గ్రామాభివృద్ధికి
ఖర్చు చేస్తానని అంగీకారం
నామినేషన్ ఉపసంహరణకు
అభ్యర్థుల ఒప్పందం
చివరి క్షణంలో
చెయ్యి ‘ఇచ్చిన’ దయాకర్
పోటీ అనివార్యం
సర్పంచ్ ఏకగ్రీవానికి రూ.50 లక్షల ఆఫర్
సర్పంచ్ ఏకగ్రీవానికి రూ.50 లక్షల ఆఫర్
సర్పంచ్ ఏకగ్రీవానికి రూ.50 లక్షల ఆఫర్
సర్పంచ్ ఏకగ్రీవానికి రూ.50 లక్షల ఆఫర్
సర్పంచ్ ఏకగ్రీవానికి రూ.50 లక్షల ఆఫర్
సర్పంచ్ ఏకగ్రీవానికి రూ.50 లక్షల ఆఫర్


