ఎలా ‘గుర్తు’ంటుంది | - | Sakshi
Sakshi News home page

ఎలా ‘గుర్తు’ంటుంది

Dec 7 2025 12:20 PM | Updated on Dec 7 2025 12:20 PM

ఎలా ‘

ఎలా ‘గుర్తు’ంటుంది

అభ్యర్థి పేరు లేకుండా బ్యాలెట్‌ పేపర్‌

దగ్గరి పోలికతో అభ్యర్థుల్లో గుబులు

జనగామ: పంచాయతీ ఎన్నికల్లో బ్యాలెట్‌ పేపర్‌పై అభ్యర్థి పేర్లు లేకుండా కేవలం గుర్తులతోనే ఓటింగ్‌.. కానీ ఆ గుర్తులే ఇప్పుడు సర్పంచ్‌ అభ్యర్థులకు గుబులు కల్పిస్తున్నాయి. గుర్తులు దగ్గర పోలికతో ఉండడంతో వృద్ధులు, నిరక్షరాస్య ఓటర్లు ఎవరికి ఓటు వేయాలో తేల్చుకోలేని పరిస్థితి. జనగామ జిల్లాలో స్టేషన్‌ఘన్‌పూర్‌లో ప్రచారం షురూ కాగా, జనగామ ని యోజకవర్గంలో శనివారం సాయంత్రం నుంచి అభ్యర్థులు ఇంటింటికీ పరుగులు పెట్టారు.

దగ్గరి పోలికతో..

సర్పంచ్‌, వార్డు అభ్యర్థులకు కేటాయించిన గుర్తుల్లో కొన్ని ఒకే రకంగా కనిపిస్తుండడంతో వృద్ధులు, నిరక్షరాస్యులు ఓటు వేసే సమయంలో తికమకకు గురయ్యే ప్రమాదం లేకపోలేదు. సర్పచ్‌లకు ఉంగరం, కత్తెర, బ్యాట్‌, ఫుట్‌బాల్‌, లేడి పర్సు, టీవీ రిమోట్‌, టూత్‌ పేస్ట్‌, స్పానర్‌(పాన), చెత్త డబ్బా, నల్ల బోర్డు, బకెట్‌, మంచం, పలక, టేబుల్‌, బ్రష్‌, బిస్కెట్‌, గాలిబుడగ ఇలా 30 రకాల గుర్తులు కేటాయించారు. వార్డులకు గౌను, గ్యాస్‌ పొయ్యి, స్టూల్‌, బీరువా, ఐస్‌ క్రీం, గాజు గ్లాసు, పోస్టు డబ్బాతో పాటు 20 గుర్తులు ఇచ్చారు. మొదటి విడత స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గంలో జరిగే పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌, వార్డు అభ్యర్థులకు కేటాయించారు. బ్యాలెట్‌ పేపర్‌పై ఓటు వేసే సమయంలో గుర్తు మరచిపోకుండా అభ్యర్థులు ఓటర్లకు ఒకటికి రెండు సార్లు అర్థం చేయాల్సి ఉంటుంది. సర్పంచ్‌ అభ్యర్థికి టేబుల్‌ అనుకుని పలక, బిస్కెట్‌, మంచం, నల్లబోర్డుకు వేస్తే.. అసలుకే మోసం వచ్చే అవకాశం లేకపోలేదని గ్రామాల్లో చర్చ వినిపిస్తోంది. బ్యాటరీ లైట్‌–బ్రష్‌కు దగ్గరి పోలిక ఉంది. అలాగే, చేతి కర్ర, బ్యాట్‌, వేణువు గుర్తులకు సైతం సూక్ష్మంగా పరిశీలించక ఓటు వేస్తే తారు మారయ్యే పరిస్థితి ఉందని ఆయా గ్రామాల్లో చర్చ సాగుతోంది. చెత్తడబ్బా, బకెట్‌, గాలిబుడగ, బాల్‌.. ఇలా గుర్తుల్లో చాలా వరకు పోలిక ఉండడం అభ్యర్థులకు ఒకింత టెన్షన్‌ అని చెప్పుకోవచ్చు. వార్డుల విషయానికి వస్తే గ్యాస్‌ స్టౌవ్‌, స్టూల్‌, గరాటా, గాజు గ్లాస్‌, బీరువా, పోస్టు డాబ్బా గుర్తులకు దగ్గరి పోలికలు ఉన్నాయి. అసలే అభ్యర్థుల పేరు లేకపోవడంతో నిరక్షరాస్యులు, వృద్ధులు అయోమయానికి గురవుతారేమోనని భావిస్తున్నారు. దీంతో అభ్యర్థులు డమ్మీ బ్యాలెట్‌ పేపర్‌ను చూపిస్తూ గుర్తుపై ఒకటికి, రెండు సార్లు అవగాహన కల్పిస్తున్నారు. పంచాయతీ పోరులో అధికార, ప్రధాన ప్రతిపక్షాలు తమ పార్టీ పేరు చెప్పుకుని ప్రచారం చేస్తుండడం, బ్యాలెట్‌పై పార్టీ గుర్తు కాకుండా ఎలక్షన్‌ కమిషన్‌ కేటాయించిన సింబల్‌ ఉండడంతో అభ్యర్థులకు సవాల్‌గా మారుతోంది.

గుబులు పుట్టిస్తున్న గుర్తులు

ఎలక్షన్‌ కమిషన్‌ అభ్యర్థులకు కేటాయించిన గుర్తుల్లో చూడడానికి దగ్గరి పోలికలు ఉండగా, ఫలానా గుర్తు అని చెబితే గానీ ఓటర్లు అర్థం చేసుకోలేని మరికొన్ని ఉన్నాయి. రెండు గుర్తులు కాస్తా తేడాగా ఉన్నప్పటికీ, కంటి చూపు సరిగా లేని వృద్ధులకు ఇవి ఒకేలా కనిపించే అవకాశం ఉంది. దీంతో ఒకరికి పడే ఓటు మరో అభ్యర్థికి పోయే ప్రమాదం లేకపోలేదని పలువురు పేర్కొంటున్నారు. చిన్న పంచాయతీల్లో పోటీ నువ్వా? నేనా అనే స్థాయిలో ఉన్న పరిస్థితుల్లో ‘గుర్తు’లు గుబులు పుట్టిస్తున్నాయి.

ఎలా ‘గుర్తు’ంటుంది1
1/3

ఎలా ‘గుర్తు’ంటుంది

ఎలా ‘గుర్తు’ంటుంది2
2/3

ఎలా ‘గుర్తు’ంటుంది

ఎలా ‘గుర్తు’ంటుంది3
3/3

ఎలా ‘గుర్తు’ంటుంది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement