దైవదర్శనానికి వెళ్లి విద్యార్థి గల్లంతు
మహబూబాబాద్ రూరల్ : దై వదర్శనానికి వెళ్లి విద్యార్థి గ ల్లంతైన సంఘటన మహబూ బాబాద్ మున్సిపల్ పరిధిలోని అనంతాద్రి మైసమ్మ చెరువులో శనివారం చోటు చేసుకుంది. రూరల్ సీఐ సర్వయ్య కథ నం ప్రకారం.. మహబూబాబాద్ మండలం కొల్ల గుంటి తండాకు చెందిన భూక్య శంకర్, అరుణ దంపతులకు కుమార్తె సాయిప్రియ, కుమారుడు సాయికిరణ్ (17) ఉన్నారు. కాగా శంకర్ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపోలో మెకానిక్ విధులు నిర్వహిస్తుండగా సమీప ప్రాంతంలోనే ఇల్లు అద్దెకు తీసుకుని నివసిస్తున్నారు. కుమారుడు సాయికిరణ్ కేసముద్రం మండల కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో సీఎస్‌ఈ డిప్లొమా ఫస్టియర్ చదువుతున్నాడు. ఈక్రమంలో శుక్రవారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని బీసీ వసతి గృహంలో ఉంటున్న మిత్రుల వద్దకు వచ్చాడు. శనివారం మధ్యాహ్నం మొదటి సంవత్సరం చివరి పరీక్ష 2గంటలకు ఉండటంతో మరో ఏడుగురు విద్యార్థులతో కలిసి దైవదర్శనం కోసం అనంతాద్రి వేంకటేశ్వరస్వామి ఆలయానికి వెళ్లారు. విద్యార్థుల్లో కొంతమంది స్నానం చేసేందుకు అక్కడే ఉన్న మైసమ్మ చెరువులోకి దిగగా ఈతరాని వారు చెరువులోకి వెళ్లలేదు. ఈత కొడుతూ సాయికిరణ్ మొదటగా కొన్ని తామరపూలు కోసి తీసుకుని ఒడ్డుకు చేరుకుని మళ్లీ చెరువులోకి దిగాడు. రెండోసారి తామర పూల కోసం మళ్లీ వెళ్లగా ఊపిరి ఆడకపోవడంతో ఓ విద్యార్థి వాటర్ బాటిల్ తీసుకువెళ్లి నీరు తాగించి కొద్దిదూరం అతడిని తీసుకొచ్చాడు. ఆ తర్వాత సదరు విద్యార్థి సాయికిరణ్‌ను బయటకు తీసుకురావడం వీలు కాకపోవడంతో ఒక్కడే ఒడ్డుకు వచ్చాడు. అంతలోనే సాయికిరణ్ గల్లంతై ఆచూకీ లభించలేదు. విషయం తెలుసుకున్న కళాశాల ప్రిన్సిపాల్ మల్లికార్జున్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో డీఎస్పీ తిరుపతిరావు, రూరల్ సీఐ సర్వయ్య, ఎస్సైలు దీపిక, రవికిరణ్, పోలీసు సిబ్బంది, అగ్నిమాపక, గజ ఈతగాళ్లు, రెస్క్యూ బృందాలు సంఘటన స్థలానికి చేరుకుని గాలింపు చేపట్టారు. సాయికిరణ్ గల్లంతు విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు, బంధుమిత్రులు ఘటనాస్థలికి చేరుకుని గుండెలవిసేలా రోదించారు. శనివారం రాత్రి పొద్దుపోయే వరకు విద్యార్థి ఆచూకీ లభించలేదు. కాగా, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్‌రావు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు.
అనంతాద్రి మైసమ్మ చెరువులో ఘటన
దైవదర్శనానికి వెళ్లి విద్యార్థి గల్లంతు
దైవదర్శనానికి వెళ్లి విద్యార్థి గల్లంతు


