బౌండ్‌డౌన్ అంటే తెలుసా?
పాలకుర్తి టౌన్: ఎన్నికల సమయంలో శాంతిభద్రతలు అతి ముఖ్యం. ఆ ప్రక్రియకు విఘాతం కలుగుతుందని భావించినప్పుడు పోలీసులు ఎ ఫ్‌ఐఆర్ నమోదు చేయకపోయినా.. వారిని త హసీల్దార్ ఎదుట హాజరుపరిచి బైండోవర్ చే స్తుంటారు. బైండోవర్ సమయంలో సదరు వ్య క్తి ఇచ్చిన రాతపూర్వక హామీని అతిక్రమించడ మే బౌండ్‌డౌన్. పోలీసులు ఎన్నికలు, పండుగలు తదితర ఉత్సవాల సమయాల్లో బౌండ్‌డౌన్ వరకు వెళ్లడం అరుదుగా కనిపిస్తుంది. తహసీ ల్దార్‌కు పాలన అధికారాలతోపాటు ఎగ్జి క్యూటి వ్ మేజిస్ట్రేట్‌గా కొన్ని న్యాయపర అధికారాలు ఉన్నాయి. అందుకే బైండోవర్ ప్రక్రియలో తహసీల్దార్ పాత్ర కీలకం.
రసవత్తర పోరు..
● తోటి కోడళ్లు, వారి కోడలు మధ్యే
సర్పంచ్ పదవికి పోటీ
వాజేడు: సర్పంచ్ పదవి కోసం తోటి కోడళ్లు పోటీ పడుతున్నారు. ఆ ఇద్దరి తో వారి కోడలు కూడా పోటీకి దిగడం పోరు రసవత్తరంగా మారింది. మండలంలోని పేరూరు సర్పంచ్ పదవి కోసం తోటి కోడళ్లు గొడ్డె సరోజని, గొడ్డె వరలక్ష్మి నామినేషన్ వేయగా వారి కోడలు గొడ్డె కృష్ణవేణి కూడా నామినేషన్ దాఖలు చేశారు. గొడ్డె సరోజన, గొడ్డె వరలక్ష్మి సొంత తోటి కోడళ్లు కాగా వరలక్ష్మి కాంగ్రెస్ మద్దతుతో, సరోజని కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీల మద్దతుతో నామినేషన్ దాఖలు చేశారు. ఈ ఇద్దరి కోడలు గొడ్డె కృష్ణ వేణి స్వతంత్ర అభ్యర్థినిగా శుక్రవారం నామినేషన్ వేయడం కొస మెరుపు. ఒకే ఇంటి పేరు ఉన్న ముగ్గురి మధ్య పోటీ ఎలా ఉండబోతుందో చూడాలి. నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ తర్వాత ఎవరెవరు పోటీలో ఉంటారో వేచి ఉండాల్సిందే.
బౌండ్‌డౌన్ అంటే తెలుసా?
బౌండ్‌డౌన్ అంటే తెలుసా?
బౌండ్‌డౌన్ అంటే తెలుసా?


