ఆగిపోయిన సన్నాయి స్వరం ..
● రోడ్డు ప్రమాదంలో కళాకారుడి దుర్మరణం
పాలకుర్తి టౌన్ : సన్నాయి స్వరం ఆగిపోయింది.. రోడ్డు ప్రమాదంలో ఓ యువ సన్నాయి కళాకారుడు దుర్మరణం చెందాడు. ఈ ఘటన శ నివారం జనగామ జిల్లా పాలకుర్తి మండలం వావి లాలలో జరిగింది. ఎస్సై పవన్‌కుమార్ కథనం ప్ర కారం.. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం రామాంజపురానికి చెందిన ఆవుదొడ్డి సంగయ్య, లక్ష్మి దంపతుల కుమారుడు మధు(21)సన్నాయి కళాకారుడు. వృత్తిలో భాగంగా రామాంజపురం నుంచి సహ కళాకారులతో కలి సి బైక్‌పై పాలకుర్తికి వస్తున్నాడు. ఈ క్రమంలో మండలంలోని వావిలాల సమీపంలో ఆగి ఉన్న టాటా ఏస్‌ను ఢీకొనడంతో మధు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘట నాస్థలికి చేరుకుని మధు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు ఎస్సై తెలిపారు. కాగా, మధు మృతిపై బంధువులు, అభిమానులు కన్నీరుమున్నీరయ్యారు.


