రైతులు పంట వ్యర్థాలను కాల్చొద్దు
● డీఏఓ విజయనిర్మల
దంతాలపల్లి: పంట వ్యర్థాలను కాల్చొద్దని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి విజయనిర్మల అన్నారు. మండలంలోని వేములపల్లి గ్రామంలో శనివారం పంట వివరాల సేకరణను పరిశీలించారు. అనంత రం రైతులతో కలిసి రైతుల పంట పొలాలను క్షేత్రస్థాయిలో పరిశీలలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పంటపొలం కోసాకా రైతులు తమ పొలంలోని గడ్డిని, వ్యర్థాలను కాల్చుతున్నారని అలా చేయడం వల్ల పంటలకు ఉపయోగపడే బ్యాక్టీరియా చనిపోతుందని తెలిపారు. పంటపొలాల వ్యర్థాలను కాల్చకుండా సింగిల్ సూపర్ ఫస్పెట్ చల్లి కలియ దున్నడంద్వారా నేల సారవంతమవుతుందని తెలిపారు. అనంతరం మండల కేంద్రంలోని ఎరువులు, విత్తనాల షాపులను తనిఖీ చేశారు. షాపుల యజమానులతో మాట్లాడుతూ.. కొనుగో లు చేసే ప్రతి వస్తువుపై రశీదులు ఇవ్వాలని తెలిపా రు. కార్యక్రమంలో ఏఓ వాహిని, వ్యవసాయ విస్తరణ అధికారులు దీక్షిత్, ఉదయ్ కిరణ్ పాల్గొన్నారు.


