నామినేషన్ వివాదం
● ఆర్‌ఓపై దాడికి యత్నం
డోర్నకల్: మండలంలోని గుర్రాలకుంట గ్రామపంచాయతీలో 4వ వార్డుకు దాఖలైన ఓ నామినేషన్‌పై బీఆర్‌ఎస్ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. శనివారం నామినేషన్ల పరిశీలన సందర్భంగా వెన్నారం రైతువేదికలో ఏర్పాటు చేసిన నామినేషన్ దాఖలు కేంద్రం వద్ద మూడు రోజల పాటు దాఖలైన నామినేషన్ల వివరాలను నోటీస్ బోర్డులో ప్రదర్శించారు. గుర్రాలకుంట 4వ వార్డులో ఇద్దరు నామినేషన్లు దాఖలు చేసినట్లు వివరాలు ఉండగా ఆర్‌ఓ వద్ద ఉన్న నామినేషన్ దాఖలు రిజిష్టర్‌లో ముగ్గురి పేర్లు ఉన్నాయి. నామినేషన్ల దాఖలు గడువు ముగిసిన తర్వాత ఇస్లావత్ నందు పేరును చేర్చారంటూ బీఆర్‌ఎస్ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. నామినేషన్ ఫారం కూడా పూర్తిగా నింపలేదని అభ్యంతరం వ్యక్తం చేయగా మూడో నామినేషన్‌ను అర్థరాత్రి ఆన్‌లైన్ చేసి రికార్డులో నమోదు చేశామని, నోటీస్ బోర్డులో ప్రకటించిన జాబితాలో మూడో పేరు చేర్చలేదని ఆర్‌ఓ తెలిపారు. పోలీసులు బీఆర్‌ఎస్ నాయకులకు సర్ధిచెప్పగా తాము ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని వారు తెలిపారు.
ఆర్‌ఓపై దాడికి యత్నం...
ఈ క్రమంలో మూడో నామినేషన్‌లో పూర్తి వివరాలు నమోదు చేయలేదని ఆరోపిస్తూ కొంతమంది.. రిటర్నింగ్ అధికారి ఇస్లావత్ చాంప్లాపై దాడికి యత్నించారు. ఆర్‌ఓ చేతిలో కాగితాలు తీసుకునేందుకు ప్రయత్నించారు. గొడవ చేస్తున్న వారిని పోలీసులు బయటకు పంపించారు. గొడవ జరుగుతున్న క్రమంలో ఆర్‌ఓ చొక్కా చినిగింది. సమాచారం అందుకున్న తహసీల్దార్ రాఘవరెడ్డి, సీఐ చంద్రమౌళి వెన్నారం చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
నామినేషన్ వివాదం


