ఎన్నికల ప్రక్రియలో ఉత్సాహంగా పాల్గొనాలి
● అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో
నెల్లికుదురు: స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో ప్రతి అధికారి ఉత్సాహంగా పాల్గొనాలని అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో అధికారులను ఆదేశించారు. మండల కేంద్రంలో ప్రోసిడింగ్స్ అధికారులకు నిర్వహించిన అవగాహన కార్యక్రమం, బ్యాలెట్ పేపర్ పరిశీలన కార్యక్రమాన్ని శనివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ.. అవగాహన కార్యక్రమంలో చెప్పిన విషయాలను సంపూర్ణంగా తెలుసుకుని ఎన్నికల్లో పాల్గొనాలని తెలిపారు. ఎన్నికల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే శాఖపరమైన చర్యలు తప్పవన్నారు. కార్యక్రమంలో ఎన్నికల అబ్జర్వర్ మధుకర్ బాబు, మండల ప్రత్యేక అధికారి జినుగు మరియన్న, తహసీల్దార్ చందా నరేష్, ఎంపీడీఓ సింగారపు కుమార్, ఎంపీఓ పద్మ జిల్లా స్థాయి మాస్టర్ టైనర్స్ శ్రీధర్, మధుసూదన్ పాల్గొన్నారు.
ఎంపీడీఓ ఆఫీస్ సందర్శన
కేసముద్రం: ఇనుగుర్తి మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయాన్ని అదనపు కలెక్టర్ లెనిన్‌వత్సల్ టొప్పో శనివారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ మేరకు ప్రోసిడింగ్ ఆఫీసర్‌లకు నిర్వహిస్తున్న ట్రైనింగ్ సెంటర్‌ను సందర్శించి, సూచనలు చేశారు. పోస్టల్ బ్యాలెట్ సెంటర్‌ను తనిఖీ చేసి, బ్యాలెట్ బాక్సులను, పేపర్లను పరీశీలించారు. ఆయన వెంట ఎంపీడీఓ పార్ధసారథి, తహసీల్దార్ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.


