ముగిసిన మూడో విడత నామినేషన్ల పర్వం
మహబూబాబాద్: గ్రామపంచాయతీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా మూడో విడత నామినేషన్ల స్వీకరణ ఈనెల 5(శుక్రవారం)తో ముగిసింది. అయితే పలు క్లస్టర్లలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ అర్ధరాత్రి వరకు సాగడంతో అధికారులు శనివరం వివరాలను వెల్లడించారు. వారు తెలిపిన వివరాల ప్రకారం 169 సర్పంచ్ స్థానాలకు 1185, వార్డు స్థానాలు 1,412 ఉండగా.. 3,592 నామినేషన్లు దాఖలైనట్లు తెలిపారు.
సర్పంచ్ స్థానాలకు 1,185..
వార్డు స్థానాలకు 3,592 నామినేషన్లు దాఖలు


