సర్పంచ్‌గా గెలిపిస్తే..
● చేపట్టనున్న పనులను ‘బాండ్’ పేపర్‌పై రాసిన అభ్యర్థి
కేసముద్రం: తనను సర్పంచ్‌గా గెలిపిస్తే గ్రామానికి చేసే పనులను ఓ బాండ్ పేపర్‌పై రాసి సాక్షులతో సహా సంతకాలు చేయించిన హామీ పత్రాన్ని శృతి అశోక్ దంపతులు శనివారం విడుదల చేశారు. మండలంలోని అర్పనపల్లి సర్పంచ్‌గా బరిలో ఉన్న ఓ మహిళా అభ్యర్థి తనను సర్పంచ్‌గా గెలిపిస్తే, తన టెంట్ హౌజ్ సామగ్రిని జీపీకి అప్పగిస్తానని, పేదింటి ఆడబిడ్డ పెళ్లికి రూ.5,016 ఆర్థికసాయ అందజేస్తానని, పేదింటి కుటుంబంలో ఎవరైనా మరణిస్తే వారి కుటుంబానికి రూ.5,016 లేదా క్వింటా బియ్యం అందజేస్తానని పేర్కొన్నారు. మొదటి 6 నెలల్లో ఫంక్షన్‌హాల్ నిర్మిస్తానని, మినరల్ వాటర్ సౌకర్యం కల్పిస్తాననే తదితర పనులు చేపడుతానని హామీ పత్రం రాసిచ్చారు. ‘ఇందులో ఏ ఒక్క పనిచేయకపోయినా నా పదవిని విరమించుకుంటానని, నా ఇష్టపూర్వకంగా రాసి ఇస్తున్న హామీ పత్రం’ అంటూ విడుదల చేశారు. ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


