ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు నిలపాలి | - | Sakshi
Sakshi News home page

ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు నిలపాలి

Dec 6 2025 8:45 AM | Updated on Dec 6 2025 8:45 AM

ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు నిలపాలి

ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు నిలపాలి

గార్ల: జిల్లాలోని గార్ల రైల్వేస్టేషన్‌లో శాతవాహన, ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు నిలుపుదల చేయాలని కోరుతూ శుక్రవారం రైల్వేమంత్రి అశ్వినివైష్ణవ్‌కు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర కలిసి వినతిపత్రం అందజేశారు. అదే విధంగా కోవిడ్‌ సమయంలో రద్దుచేసిన విజయవాడ టు కాజీపేట ప్యాసింజర్‌, మణుగూరు టు కొల్హాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను పునరుద్ధరించాలని ఆయన ఆ వినతిపత్రంలో పేర్కొన్నారు. దీనిపై రైల్వేమంత్రి సానుకూలంగా స్పందించి గార్ల రైల్వేస్టేషన్‌లో రైళ్ల నిలుపుదలకు కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు ఎంపీ రవిచంద్ర తెలిపారు.

పోలింగ్‌ కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాలి

కలెక్టర్‌ అద్వైత్‌కుమార్‌సింగ్‌

మహబూబాబాద్‌: గ్రామ పంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని, పోలింగ్‌ కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాలని కలెక్టర్‌ అద్వైత్‌కుమార్‌ సింగ్‌ అధికారులను ఆదేశించారు. కలెక్టర్‌ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌లోని సమావేశ మందిరంలో శుక్రవారం కలెక్టర్‌ సంబంధి త అధికారులతో ఎన్నికల నిర్వహణపై సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ అద్వైత్‌కుమార్‌ సింగ్‌ మా ట్లాడుతూ.. ఎన్నికల నిర్వహణపై అధికారులు ప్ర త్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక దృష్టిపెట్టి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. సంబంధిత అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. సీనియర్‌ అధికారులు, ప్రత్యేక అధికారులు వారి మండలాల్లో రూట్‌ మ్యాప్‌ తయా రు చేసుకుని ముందుకెళ్లాలన్నారు. ప్రొటోకాల్‌ పాటిస్తూ పనులు చేసుకోవాలన్నారు. ఎలాంటి పొ రపాట్లు లేకుండా ఎన్నికల నిర్వహణ జరిగేలా చూ డాలన్నారు. అదనపు కలెక్టర్లు లెనిన్‌ వత్సల్‌ టొ ప్పో, అనిల్‌కుమార్‌ జెడ్పీ సీఈఓ పురుషోత్తం, డీపీ ఓ హరిప్రసాద్‌, సంబంధిత అధికారులు ఉన్నారు.

విద్యుత్‌ బిల్లుల వసూళ్లలో టాప్‌

తొర్రూరు రూరల్‌: విద్యుత్‌ బిల్లుల వసూళ్లలో 40 డివిజన్లలో తొర్రూరు డివిజన్‌ ముందంజలో ఉందని విద్యుత్‌శాఖ డీఈ రవి అన్నారు. శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో డీఈ మాట్లాడుతూ.. వినియోగదారులు కరెంట్‌ సరఫరాను సక్రమంగా వినియోగించుకుంటూ, బిల్లులు చెల్లించడం సంతోషకరమన్నారు. విద్యుత్‌ సిబ్బంది, వినియోగదారుల సహాయ సహకారాలతో బిల్లుల వసూళ్లలో తొర్రూరు డివిజన్‌ టాప్‌లో ఉందని కొనియాడారు. భవి ష్యత్‌లో విద్యుత్‌ బిల్లులను చెల్లించడానికి విని యోగదారులు మరింత ఎక్కువగా సహకరించి విద్యుత్‌ సంస్థ బలోపేతానికి కృషి చేయాలన్నారు.

10న వాహనాల వేలం

మహబూబాబాద్‌ రూరల్‌ : బెల్లం, సారాయి సరఫరా చేస్తూ వివిధ కేసుల్లో పట్టుబడిన వాహనాలను ఈ నెల 10వ తేదీన ఉదయం 11 గంటలకు మహబూబాబాద్‌ ఎకై ్సజ్‌ స్టేషన్‌ ఆవరణలో బహిరంగ వేలం పాట నిర్వహిస్తున్నామని ప్రొహిబిషన్‌, ఎకై ్సజ్‌ సీఐ జి.చిరంజీవి శుక్రవారం తెలిపారు. ఎకై ్సజ్‌ శాఖ వరంగల్‌ డిప్యూటీ కమిషనర్‌ అంజన్‌ రావు, జిల్లా ఎకై ్సజ్‌ అధికారి కిరణ్‌ ఆదేశాల మేరకు వాహనాల వేలంపాట జరుగుతుందని, పాల్గొనే వారు వాహన ధరలో 50శాతం మొత్తాన్ని డిస్ట్రిక్ట్‌ ప్రొహిబిషన్‌ అండ్‌ ఎకై ్సజ్‌ ఆఫీసర్‌ పేరున డీడీ తీయాలని, దాంతోపాటు దరఖాస్తు, ఆధార్‌ కార్డు జిరాక్స్‌ సమర్పించాలని సూచించారు. వాహనాల వివరాలు మహబూబాబాద్‌ ఎకై ్సజ్‌ స్టేషన్‌లో ఉన్నాయని, వాహనాలను చూసి వేలం పాటలో పాల్గొనాలన్నారు. వేలంపాటకు దరఖాస్తులు 10వ తేదీ ఉదయం 9గంటల వరకు మాత్రమే తీసుకుంటామని తెలిపారు.

13న నవోదయ ప్రవేశ పరీక్ష

మహబూబాబాద్‌ అర్బన్‌: జవహర్‌లాల్‌ నవోదయ విద్యాలయంలో 2026–27 విద్యా సంవత్సరానికి గానూ 6వ తరగతిలో ప్రవేశానికి ఈ నెల 13న ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ప్రవేశపరీక్ష నిర్వహించనున్నట్లు విద్యాలయం ప్రిన్సిపాల్‌ బి.పూర్ణిమ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పరీక్షకు 5,648 మంది విద్యార్థులు దరఖాస్తు చేశారని, ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో 28 పరీక్ష సెంటర్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు హాల్‌ టికెట్లను ఆన్‌లైన్‌లో సంబంధిత వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్‌ చేసుకోవాన్నారు. పూర్తి వివరాలకు 9110782213 నంబర్‌లో సంప్రదించాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement