ఎన్నికల నిబంధనలు పాటించాలి
మహబూబాబాద్ రూరల్ : సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎన్నికల నిబంధనలు పాటించాలని డీఎస్పీ తిరుపతిరావు అన్నారు. మహబూబాబాద్ మండలంలోని సర్పంచ్, వార్డు అభ్యర్థులకు శుక్రవారం పట్టణంలో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ తిరుపతిరావు మొదటి విడతలో జరగనున్న గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా చేయాల్సిన, చేయకూడని పనులు, ఎన్నికల ప్రవర్తనా నియమావళి గురించి వివరించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు పూర్తి చేసుకోవాలని సూచించారు. గ్రామపంచాయతీ ఎన్నికల దృష్ట్యా ఎఫ్‌ఎస్‌టీ, ఎస్‌ఎస్‌టీ, పెట్రోలింగ్ పార్టీల ద్వారా అన్ని గ్రామాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటుచేసి.. ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రూరల్ సీఐ సర్వయ్య, తహసీల్దార్ చంద్రరాజేశ్వరరావు, కురవి, రూరల్ ఎస్సైలు దీపిక, రవికిరణ్, రూరల్ పోలీస్ స్టేషన్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
ఎన్నికల నిబంధనలు పాటించాలి


