విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు
గార్ల: విధుల్లో నిర్లక్ష్యం వహించిన వైద్య సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తప్పవని డీసీహెచ్‌ఎస్ డాక్టర్ రమేశ్ హెచ్చరించారు. శుక్రవారం గార్ల సీహెచ్‌సీని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. తొలుత వైద్యులు, వైద్య సిబ్బంది హాజరు పట్టికను పరిశీలించి, సమయపాలన పాటించాలని ఆదేశించారు. వైద్యం కోసం ఆస్పత్రికి వచ్చే రోగులతో సిబ్బంది మర్యాదగా మాట్లాడాలని సూచించారు. అనంతరం ఆస్పత్రి వార్డులను సందర్శించి వైద్యసేవలు ఎలా అందుతున్నాయని రోగులను అడిగి తెలుసుకున్నారు. రోగులకు అందించే మెనూ అమలు తీరుతెన్నులను పరిశీలించారు. మెనూ ప్రకారం రోగుల కు భోజనం వడ్డించాలని, మెనూలో తేడా వస్తే టెండర్ ఏజెన్సీని రద్దు చేస్తామన్నారు. గ్రామ పంచా యతీ ఎన్నికలు సమీపిస్తున్నందున వైద్యులు, వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర చి కిత్స కోసం వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించాలన్నారు. ఆస్పత్రిలో పనిచేసే కిందిస్థాయి సిబ్బంది.. వైద్యుల ఆదేశానుసారం విధిగా పనిచేయాలని సూచించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రీధర్‌గౌడ్, డాక్టర్ బాలునాయక్, డాక్టర్ హనుమంతరావు, నర్సింగ్ ఆఫీసర్ స్వాతి, ఫార్మసిస్ట్ జ్యోతి, సిబ్బంది పాల్గొన్నారు.


