వరంగల్ మీదుగా శబరిమలకు ప్రత్యేక రైళ్లు
కాజీపేట రూరల్ : వరంగల్ మీదుగా హజుర్ సాహిబ్ నాందేడ్–కొల్లం మధ్య రెండు ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎ.శ్రీధర్ గురువారం తెలిపారు.
ప్రత్యేక రైళ్ల వివరాలు..
2026, జనవరి 7వ తేదీన హజుర్ సాహిబ్ నాందేడ్–కొల్లం (07133) ఎక్స్‌ప్రెస్ వరంగల్‌కు చేరుకుని వెళ్తుంది. అదేవిధంగా 2026 , జనవరి 9వ తేదీన కొల్లం–హజుర్ సాహిబ్ నాందేడ్ (07134) ఎక్స్‌ప్రెస్ వరంగల్‌కు చేరుకుని వెళ్తుంది. ఈ ప్రత్యేక రైళ్లకు ముద్కెడ్, ధర్మాబాద్, బాక్సర్, నిజామాబాద్, ఆర్మూర్, కోరుట్ల, లింగంపేట, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జమ్మికుంట, వరంగల్, కేసముద్రం, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట, తిరుపతి, పాకాల, చిత్తూరు, కట్‌పడి, జోలుర్‌పెట్టాయ్, సేలం, ఈరోడ్, తిరుప్పుర్, పొదనూర్, పాల్‌క్కడ్, త్రిశూరు, అలువా, ఎర్నాకుళం టౌన్, కొట్టాయం, తిరువల్ల, చెంగనూర్, కాయన్‌కూలంలో హాల్టింగ్ కల్పించారు.
వరంగల్ మీదుగా శబరిమలకు ప్రత్యేక రైళ్లు


