నువ్వా..? నేనా..?
● ఫతేషాపూర్ సర్పంచ్ బరిలో తోటి కోడళ్లు
రఘునాథపల్లి: జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఫతేషాపూర్ పంచాయతీ ఎన్నికల్లో తోటి కోడళ్లు బరిలో నిలిచారు. నువ్వా? నేనా అన్నట్లు పోటీ పడుతున్నారు. 1,237 మంది ఓటర్లు కలిగిన గ్రామం ఈ సారి సర్పంచ్ స్థానం బీసీ మహిళకు రిజర్వ్ అయ్యింది. దీంతో కాంగ్రెస్ తరఫున అక్కనపల్లి సుజాత, బీఆర్‌ఎస్ తరఫున అక్కనపల్లి మాధవి నామినేషన్లు దాఖలు చేశారు. బుధవారం నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసే సరికి ఇద్దరే బరిలో ఉండడంతో పోటీ ఆసక్తికరంగా మారంది. నువ్వా? నేనా అన్నట్లు పోటీ ఉండడంతో ఇద్దరిలో సర్పంచ్ పదవి ఎవరిని వరిస్తుందో ఈ నెల 11 వరకు వేచి చూడాల్సిందే. గురువారం తమ అనుచరులతో గ్రామంలో వార్డుల వారీగా తోటి కోడళ్లు ముమ్మర ప్రచారం నిర్వహించారు.
నువ్వా..? నేనా..?


