గోవిందరాజు గద్దెను కదిలించిన పూజారులు | - | Sakshi
Sakshi News home page

గోవిందరాజు గద్దెను కదిలించిన పూజారులు

Dec 5 2025 6:48 AM | Updated on Dec 5 2025 6:48 AM

గోవిం

గోవిందరాజు గద్దెను కదిలించిన పూజారులు

ఎస్‌ఎస్‌తాడ్వాయి : మేడారంలో కొలువైన గోవిందరాజు గద్దెను పూజారులు గురువారం కదిలించారు. ఏటూరునాగారం మండలం కొండాయిలో గల గోవిందరాజు పూజారులు మేడారానికి వచ్చారు. అనంతరం సమ్మక్క–సారలమ్మ పూజారులతో కలిసి గోవిందరాజు పాత గద్దె వద్ద ప్రత్యేక పూజలు చేశారు. ఐదుగురు పూజారులు కలిసి గద్దెను కదిలించారు. ఈ కార్యక్రమానికి ముందు సమ్మక్క,సారలమ్మ గద్దెల వద్ద పసుపు, కుంకుమ, సారా ఆరగించి పూజలు నిర్వహించారు. నవంబర్‌ 23వ తేదీన పగిడిద్దరాజు గద్దెను పూజారులు కదిలించిన విషయం తెలిసిందే. గోవిందరాజు గద్దె కదిలించే కార్యక్రమం పూర్తయ్యే వరకు భక్తులను, ఇతరులు రాకుండా కట్టడి చేశారు. పునఃనిర్మిస్తున్న గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెల పనులు పూర్తయిన తర్వాత గద్దెలపై ఽధ్వజ స్తంభాలను ప్రతిష్ఠించనున్నారు. ఈ కార్యక్రమంలో పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు, పూజారులు కాక వెంకటేశ్వర్లు, కాక సారయ్య, కొక్కెర రమేశ్‌, చందా రఘుపతి, పగిడిద్దరాజు పూజారి దబ్బకట్ల గోవర్ధన్‌, పూజారులు పాల్గొన్నారు.

ఈనెల 24న గద్దెలపై పునఃప్రతిష్ఠ

గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెలపై ఈనెల 24న పునఃప్రతిష్ఠ పూజ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పూజారులు తెలిపారు. గద్దెలను విస్తరిస్తున్న క్రమంలో పూజారులు సమ్మక్క, సారలమ్మ గద్దెలను కదిలించనున్నారు. గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెల పునర్నిర్మాణ పనులు పూర్తికాకపోవడంతో తిరిగి ఈనెల 24న నిర్వహించేందుకు పూజారులు తేదీ ఖరారు చేశారు.

అమ్మవార్లకు పౌర్ణమి మొక్కులు..

మేడారం సమ్మక్క, సారలమ్మను దర్శించుకునేందుకు గురువారం భక్తులు అధిక సంఖ్యలో తరలొచ్చారు. జంపన్నవాగులో స్నానాలు ఆచరించిన అనంతరం అమ్మవార్ల గద్దెల వద్ద పసుపు, కుంకుమ, చీరసారె, కానుకలు, ఒడిబియ్యం, ఎత్తు బంగారం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం మేడారం పరిసరాల్లో విడిది చేసి వంటావార్పు చేసుకున్నారు. కాగా, ఈఓ వీరస్వామి మేడారంలో గద్దెల ప్రాంగంణ పునర్నిర్మాణ పనులను పరిశీలించారు.

ముందుగా సమ్మక్క, సారలమ్మకు ప్రత్యేక పూజలు

గోవిందరాజు గద్దెను కదిలించిన పూజారులు1
1/1

గోవిందరాజు గద్దెను కదిలించిన పూజారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement