వరుస చోరీలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్
గీసుకొండ: వరంగల్ కమిషనరేట్ పరిధిలోని పలు ప్రాంతాల్లో వరుస చోరీలకు పాల్పడుతున్న నలుగు రు దొంగల ముఠా సభ్యులతోపాటు వారికి సహకరిస్తున్న ఓ వ్యక్తిని గీసుకొండ పోలీసులు అరెస్ట్ చేశా రు. ఈ మేరకు గురువారం గీసుకొండ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మా మునూరు ఏసీపీ వెంకటేశ్ వివరాలు వెల్లడించారు. నర్సంపేట ముగ్ధుంపురానికి చెందిన భాదవత్ సా యిచరణ్, వరంగల్ పోచమ్మమైదాన్‌కు చెందిన ఎం.డి. గౌస్‌పాషా, కాశిబుగ్గకు చెందిన కోట విశ్వతేజ, వర్ధన్నపేట ఇల్లందకు చెందిన రాయపురం సాయి.. గతంలో చోరీలకు పాల్పడి జైలుకెళ్లిన క్రమంలో మధ్య పరిచయం ఏర్పడింది. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా వారి ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాకపోగా ముఠాగా ఏర్పడి గొర్రెలను అపహరించి సులభంగా డబ్బు సంపాదించాలకున్నారు. ముందుగానే గొర్రెలు ఉన్న ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించేవారు. రాత్రి వేళల్లో సెల్ఫ్ డ్రైవ్ కార్లను అద్దెకు తీసుకుని అందులో గొర్రెలను తీసుకెళ్లి వర్ధన్నపేట ప్రాంతానికి చెందిన అంగడి వెంకన్న అనే మాంసం వ్యాపారికి అమ్మేవారు. ఇటీవల గీసుకొండ మండల పరిధిలో నాలుగు గొర్రెలను అపహరించారు. అలాగే, కొమ్మాల శివారులో ఇంటి తాళాలు పగులగొట్టి రూ. 1.05 లక్షల నగ దు, ఖిలావరంగల్ మండలం బొల్లికుంటలో రెండిళ్ల తాళాలు పగులగొట్టి కొంత నగదు ఎత్తుకెళ్లారు. గు రువారం ఊకల్ క్రాస్‌రోడ్డు వద్ద పోలీసులు రెండు కార్లను ఆపి తనిఖీ చేయగా అందులో గొర్రెల మ లం, వెంట్రుకలు కనిపించారు. దీంతో కారులో ప్ర యాణిస్తున్న వారిని అదుపులోకి తీసుకుని విచారించగా విషయం బహిర్గతమైంది. రూ. 1.60 లక్షల నగదు స్వాధీనం చేసుకుని చోరీలకు పాల్పడుతున్న నలుగురితోపాటు వారికి సహకరించిన మాంసం వ్యాపారిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఏసీపీ తెలిపారు. దొంగలను పట్టుకోవడంలో ప్రతిభకనబర్చిన ఇన్‌స్పెక్టర్ డి. విశ్వేశ్వర్, ఎస్సై కె. కుమార్, సిబ్బంది విజయ్, అరవింద్, సాయి, హరి, రజనీకుమార్‌ను ఏసీపీ అభినందించారు.
రూ. 1.60 లక్షల నగదు స్వాధీనం
వివరాలు వెల్లడించిన పోలీసులు


