నిబంధనల మేరకు దివ్యాంగులకు అవకాశాలు
● కేయూ వీసీ ప్రతాప్‌రెడ్డి
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలో నిబంధనల మేరకు దివ్యాంగులకు అవకాశాలు కల్పిస్తామని వీసీ కె. ప్రతాప్‌రెడ్డి అన్నారు. కేయూ దివ్యాంగుల సెల్ ఆధ్వర్యంలో గురువారం సెనేట్‌హాల్‌లో నిర్వహించిన అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవంలో వీసీ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. పరిపాలన భవనంలో లిఫ్ట్ సదుపాయం కల్పించామని, హ్యూమనిటీస్, దూరవిద్య కేంద్రంలో కూడా కల్పించబోతున్నట్లు వెల్లడించారు. క్రీడా రంగంలో భాగంగా పారా ఒలంపిక్ క్రీడలు నిర్వహించాలని యూనివర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్‌కు సూచించారు. పరిశోధకులు, ప్రొఫెషనల్ విద్యార్థులకు క్యాంపస్‌లో ఇంటర్నెట్ సదుపాయాలు బలోపేతం చేస్తామని పేర్కొన్నారు.
చదువు, క్రీడలకు వైకల్యం అడ్డు కాదు..
చదువు, క్రీడలు, తదితర రంగాల్లో ప్రతిభచూపేందుకు వైలక్యం అడ్డుకాదని, సంకల్పమే శక్తిగా ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలని రాష్ట్ర దివ్యాంగుల కోఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య అన్నారు. తమకు అందుబాటులో ఉ న్న జీఓలను దివ్యాంగులు వినియోగించుకోవాలన్నారు. పీహెచ్‌డీ, పీజీ కోర్సులు పూర్తిచేసిన దివ్యాంగ అభ్యర్థులకు కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్, పార్ట్‌టైం ఉద్యోగావకాశాలు కూడా కల్పించేలా ప్రాధాన్యం ఇస్తామన్నారు. కేయూ రిజిస్ట్రార్ రామచంద్రం, దివ్యాంగుల సెల్‌డైరెక్టర్ రాజు, కేయూ పాలకమండలి సభ్యురాలు అనితారెడ్డి, యూని వర్సిటీ క్యాంపస్ కాలేజీ ప్రిన్సిపాల్ మనోహర్, యూజీసీ కోఆర్డినేటర్ మల్లికార్జున్‌రెడ్డి, దివ్యాంగ విద్యార్థి అసోసియేషన్ అధ్యక్షుడు రాములు, బాధ్యుడు రాంబాబు పాల్గొన్నారు. కాగా, తెలుగు విభాగంలో పీహెచ్‌డీ పూర్తిచేసిన శారద, పదో ఏషియన్ పారా తైక్వాండో చాంపియన్ మాచర్ల కృష్ణవేణిను అతిథులు సన్మానించారు.


