ఏళ్లుగా ఆ కుటుంబానిదే అధికారం..
● ఏడుసార్లు సర్పంచ్‌లుగా ఎన్నుకున్న గ్రామస్తులు
వాజేడు: ఏళ్లుగా ఆ కుటుంబానిదే అధికారం. ఏడుసార్లు ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులను గ్రామస్తులు సర్పంచ్‌లుగా ఎన్నుకున్నారు. వాజేడు మండలం నాగారం గ్రామ పంచాయతీకి ఎనిమిది దఫాలు ఎన్నికలు జరగగా అందులో ఏడు సార్లు వాజేడుకు చెందిన తల్లడి పాపారావు కుటుంబం నుంచి సర్పంచ్‌లుగా ఎన్నుకున్నారు. 1984, 1989, 1994, 1999, 2004 వరకు తల్లడి పాపారావు ఐదు సార్లు పోటీ చేసి సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2009లో ఆయన కుటుంబం నుంచి ఎవరూ పోటీ చేయకపోవడంతో బోదెబోయిన కృష్ణ సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. 2014లో తల్లడి పాపారావు కోడలు పుష్పలత సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. అదే విధంగా 2019లో తల్లడి పాపారావు తమ్ముడు ఆదినారాయణ సర్పంచ్‌గా ఎన్నికయ్యాడు. ఇలా ఒకే కుంటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ఏడుసార్లు నాగారం సర్పంచ్ పదవిని కై వసం చేసుకున్నారు.
ఏళ్లుగా ఆ కుటుంబానిదే అధికారం..
ఏళ్లుగా ఆ కుటుంబానిదే అధికారం..


