మద్యం బ్రాండ్ల కొరత
డోర్నకల్: గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో స్థానిక వైన్‌షాపుల్లో కొన్ని బ్రాండ్లకు కొరత ఏర్పడింది. ఎన్నికల్లో పోటీ చేస్తున్న నాయకులు భారీగా మద్యం కొనుగోలు చేసి నిల్వ చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎంసీ విస్కీ, ఐబీ, ఓసీ క్వార్టర్ బాటిళ్లను పెద్ద ఎత్తున కొనుగోలు చేసినట్లు ప్రచారం. కొద్ది రోజులుగా మద్యం దుకాణాల్లో ఆయా బ్రాండ్ల క్వార్టర్ బాటిళ్లు దొరకకపోవడంపై మద్యం ప్రియులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఎస్పీని కలిసిన ‘తెరవే’ బాధ్యులు
మహబూబాబాద్ రూరల్: ఇటీవల జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన డాక్టర్ శబరీష్‌ను తెలంగాణ రచయితల వేదిక (తెరవే) ఆధ్వర్యంలో బుధవారం మర్యాదపూర్వంగా కలిసి శుభాకా ంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రచయితల వేదిక జిల్లా అధ్యక్షుడు గుర్రపు సత్యనారాయణ, కవులు బాణాల వీరయ్య, రేణిగుంట్ల లక్ష్మీకాంతరావు, నాలం శ్రీనివాసు తదితరులు పాల్గొన్నారు.
డీఈఓకు సన్మానం
మహబూబాబాద్ అర్బన్: జిల్లా కేంద్రంలోని విద్యాశాఖ కార్యాలయంలో ఇటీవల డీఈఓగా బాధ్యతలు స్వీకరించిన రాజేశ్వర్‌ను రిటైర్డ్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు సంకా బద్రినారాయణ, నాయకులు బుధవారం మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి గుగులోతు కిషన్ నాయక్, గౌరవ అధ్యక్షుడు గోవర్ధన్, మురళీధర్‌స్వామి, రమేష్ బాబు, నిరంజన్‌రెడ్డి, బాణాల గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.
కేయూలో నెట్‌వర్కింగ్ ఆధునికీకరణ
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలోని క్యాంపస్ నెట్‌వర్కింగ్‌ను ఆధునికీకరించేందుకు బీఎస్‌ఎన్‌ఎల్‌కు వర్క్ ఆర్డర్ జారీచేసినట్లు కేయూ రిజిస్ట్రార్ వి.రామచంద్రం బుధవారం తెలిపారు. కేయూ వీసీ కె. ప్రతాప్‌రెడ్డి సమక్షంలో వర్క్ ఆర్డర్‌పై విధివిధానాలపై సమీక్షించారు. రూసా నిధులతో విశ్వవిద్యాలయం కే హాబ్ స్టార్టప్స్, అంకుర సంస్థలను ప్రోత్సహించడం, మౌలిక వసతులు, క్యాంపస్‌లో ఇంటర్నెట్ సదుపాయాన్ని మెరుగుపరుస్తారు. రూసా అనుమతి పొందిన, మంజూరైన ప్రాజెక్టులు, అలాగే, ఇంజనీరింగ్ కళాశాలల్లో కొనాగుతున్న రీసెర్చ్ ప్రాజెక్టులకు అవసరమైన నెట్‌వర్క్ విస్తరించడం లక్ష్యంగా ఈవర్క్ ఆర్డర్‌ను బీఎస్‌ఎన్‌ఎల్‌కు జారీ చేసినట్లు రామచంద్రం తెలిపారు. క్యాంపస్ నెట్‌వర్కింగ్ వ్యవస్థను అభివృద్ధి చేసి సామర్థ్యాన్ని పెంపొందించేందుకు బీఎస్‌ఎన్‌ఎల్ సహకారంతో రూ.1.29 కోట్లు యూనివర్సిటీ వెచ్చించనున్నట్లు రిజిస్ట్రార్ రామచంద్రం తెలిపారు.
నేడు మేడారంలో పునఃప్రతిష్ఠాపన పూజలు
ఎస్‌ఎస్‌తాడ్వాయి: ఇటీవల మేడారంలో పూజారులు పగిడిద్దరాజు పాత గద్దెను కదలించారు.. నేడు గోవిందరాజు పూజారులు సైతం పాత గద్దెను కదలించి నూతనంగా నిర్మించిన గద్దెలపై పునఃప్రతిష్ఠించనున్నారు. ఈ మేరకు గురువారం గద్దెలపై పునఃప్రతిష్ఠాపన పూజా కార్యక్రమాలను పూజారులు నిర్వహించనున్నారు. పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు పూజారులు, కొండాయి నుంచి గోవిందరాజుల పూజారులు వారివారి గుళ్ల వద్ద పూజలు నిర్వహించి మేడారానికి రానున్నారు. సమ్మక్క–సారలమ్మ గద్దెల వరుస క్రమంలో నూతనంగా పునర్నిర్మిస్తున్న గద్దెలపై పునప్రతిష్ఠాపన పూజా కార్యక్రమాలకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు దేవాదాయశాఖ అఽధికారులు పూజా సామగ్రిని పూజారులకు అందజేశారు. ఈ పూజ కార్యక్రమాలకు గోవిందరాజు, పగిడిద్దరాజు పూజారులు ఆడబిడ్డలను ఆహ్వానించనున్నారు. పూజారులు పౌర్ణమికి ముందుగా పూజా కార్యక్రమాలను నిర్వహించడం ఆనవాయితీ. నేడు పౌర్ణమి సందర్భంగా నూతన గద్దెలపై పునఃప్రతిష్ఠాపన పూజా కార్యక్రమాలను నిర్వహించేందుకు సిద్ధమయ్యారు.
మద్యం బ్రాండ్ల కొరత
మద్యం బ్రాండ్ల కొరత


