దివ్యాంగులను ప్రోత్సహించాలి
మహబూబాబాద్ అర్బన్: సమాజంలో దివ్యాంగులను అన్ని రంగాల్లో ప్రోత్సహించాలని అడిషనల్ కలెక్టర్ లెనిన్ వత్సల్‌టొప్పో అన్నారు. జిల్లా కేంద్రంలోని గిరిజన భవనంలో బుధవారం డీడబ్ల్యూఓ సబిత అధ్యక్షతన అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ.. దివ్యాంగులు సమాజానికి స్ఫూర్తి ప్రదాతలని, ప్రపంచ వేదికలపై మన దేశ కీర్తిని చాటారని, వారితో ఆత్మీయంగా మెలగాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందన్నారు. ఎంతో మంది దివ్యాంగులు పట్టుదలతో శ్రమించి వివిధ రంగాల్లో ఉన్నత శిఖరాలకు చేరారని, దివ్యాంగులు క్రీడలను జీవితంలో భాగస్వామ్యం చేసుకోవాలన్నారు. స్వశక్తితో గర్వంగా జీవించేందుకు ప్రయత్నించాలన్నారు. అనంతరం వివిధ క్రీడా పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. పలువురు దివ్యాంగులను సన్మానించారు. కార్యక్రమంలో మెప్మా జిల్లా అధికారి విజయకుమారి, సీడీపీఓలు శిరీష, ఎల్లమ్మ, సూపర్‌వైజర్లు దైదుషారాణి, పద్మావతి, విజయ, కవిత, భవాని, దుర్గ, అధికారులు రాజు, కమలార్, దివ్యాంగులు పాల్గొన్నారు.
అడిషనల్ కలెక్టర్ లెనిన్ వత్సల్‌టొప్పో


