తుపాను సాయం అందించండి
హన్మకొండ చౌరస్తా: మోంథా తుపాను కారణంగా వరంగల్ నగరానికి తీవ్ర భారీ నష్టం వాటిల్లిందని, తక్షణమే సాయం అందించాలని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య బుధవారం లోక్‌సభలో జీరో అవర్‌లో గళమెత్తారు. మోంంథా తుపాను కారణంగా వరంగల్ నగరంలో 200 మీల్లీ లీటర్ల భారీ వర్ష కురిసిందని, తద్వారా నగరంలో 45 కాలనీలు నీట మునిగాయని వివరించారు. కొన్ని చోట్ల రహదారులు నదులుగా మారాయని, ఓ గర్భిణినీ ట్రాక్టర్‌లో తరలించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. నగరంలో అమృత్, స్మార్ట్‌సిటీ పథకాల ద్వారా చేపట్టిన డ్రైనేజీ పనులు 66 శాతం మాత్రమే పూర్తికావడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. ఇది పూర్తిగా ప్రణాళిక వైఫల్యమే అని పార్లమెంట్‌లో తెలిపారు. అమృత్ 2.0 ద్వారా ప్రత్యేక నిధులు మార్చి 2026లో విడుదల చేయాలని, జీడబ్ల్యూఎంసీ, మౌలిక వసతులపై ఉన్నత స్థాయి ఆడిట్‌కు ఆదేశించాలని, రహదారుల పునఃనిర్మాణానికి రూ.100 కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని ఎంపీ కేంద్రాన్ని కోరారు. హెరిటేజ్, స్మార్ట్‌సిటీ అయిన వరంగల్ ఏటా వర్షాలతో నష్టపోకుండా కేంద్ర ప్రభుత్వం శాశ్వత పరిష్కార దిశగా మౌలిక వసతులు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
లోక్‌సభలో వరంగల్
ఎంపీ డాక్టర్ కావ్య


