మేడారంలో వేగంగా విద్యుత్‌ పనులు | - | Sakshi
Sakshi News home page

మేడారంలో వేగంగా విద్యుత్‌ పనులు

Dec 4 2025 8:44 AM | Updated on Dec 4 2025 8:44 AM

మేడారంలో వేగంగా విద్యుత్‌ పనులు

మేడారంలో వేగంగా విద్యుత్‌ పనులు

ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారం మహాజాతరలో భక్తుల సౌకర్యార్థం చేపడుతున్న విద్యుత్‌ పనులు వేగంగా కొనసాగుతున్నాయని ఎన్పీడీసీఎల్‌ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి తెలిపారు. బుధవారం మేడారంలో ములుగు సర్కిల్‌ పరిధిలోని అధికారులు, కాంట్రాక్ట్‌ ఏజెన్సీలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం 8 కిలోమీటర్ల మేర కవర్డ్‌ కండక్టర్‌ పనులు పూర్తి కా గా, భక్తుల రద్దీ పెరిగే సందర్భంలో విద్యుత్‌ లోపాలు లేకుండా ఉండేందుకు 70 కొత్త ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అదేవిధంగా 25 కిలోమీటర్ల మేర విద్యుత్‌ లైన్‌ పనులు పూర్తయినట్లు వెల్లడించారు. మిగతా పనులను ఈ నెల 20వ తేదీలోపు పూర్తి చేయాలని సంబంధిత అధి కారులను ఆదేశించారు. అదనంగా మేడారంలోని సమ్మక్క సబ్‌స్టేషన్‌లో 5 ఎంవీఏ పవర్‌ ట్రాన్స్‌ఫా ర్మర్‌ ఏర్పాటు చేస్తున్నామని, విద్యుత్‌ అంతరాయం లేకుండా జంపన్న వాగు వద్ద 6 టవర్ల నిర్మాణం చేపట్టగా, అందులో 4 టవర్లు ఇప్పటికే పూర్తయ్యాయని తెలిపారు. అనంతరం నిర్మాణంలో ఉన్న 33/11 కేవీ నార్లాపూర్‌ సబ్‌స్టేషన్‌ను పరిశీలించి పనుల పురోగతిని సమీక్షించారు. ఈ నెలాఖరులోపు పూర్తి చేయాలని ఏజెన్సీలను ఆదేశించారు. పస్రా సెక్షన్‌ ఆఫీస్‌లో నిర్మిస్తున్న కంట్రోల్‌ రూం, డ్యూటీ రూం పనులను పర్యవేక్షించారు. ములుగు ఎస్‌ఈ ఆనందం, డీఈఈలు సదానందం, పురుషోత్తం , ఏడీఈలు రాజేశ్‌, వేణుగోపాల్‌, సందీప్‌ పాటిల్‌, ఈఈ (సివిల్‌) వెంకట్‌రామ్‌ పాల్గొన్నారు.

విద్యుత్‌ బిల్లుల చెల్లింపు మరింత సులువు..

హన్మకొండ: విద్యుత్‌ బిల్లుల చెల్లింపు మరింత సులవని, అధునాతన సాంకేతికత పరిజ్ఞానాన్ని వినియోగదారుల ముంగిటకు తీసుకొచ్చామని టీజీఎన్పీడీసీఎల్‌ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ కర్నాటి వరుణ్‌ రెడ్డి అన్నారు. హనుమకొండ నక్కలగుట్టలోని విద్యుత్‌ బిల్లుల చెల్లింపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆన్‌లైన్‌ పేమెంట్‌ సిస్టం (కియోస్క్‌)ను బుధవారం లాంఛనంగా ప్రారంభించి మాట్లాడారు. విద్యుత్‌ సేవలను పూర్తిగా డిజిటల్‌ వైపునకు మళ్లిస్తున్నామన్నారు. వినియోగదారులు మరింత వేగంగా తమ బిల్లులను చెల్లించుకునేలా రూపొందించిన ఆన్‌లైన్‌ పేమెంట్‌ సిస్టమ్‌ (కియోస్క్‌)ను యూనియన్‌ బ్యాంకు సహకారంతో పైలెట్‌ ప్రాజెక్ట్‌ కింద చేపట్టామని తెలిపారు. త్వరలో మరిన్ని ఈఆర్వో కేంద్రాల్లో ప్రారంభిస్తామన్నారు. కార్యక్రమంలో ఫైనాన్స్‌ డైరెక్టర్‌ వి.తిరుపతి రెడ్డి, చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ ఆర్‌.చరణ్‌ దాస్‌, చీఫ్‌ ఇంజనీర్‌ శ్రవణ్‌ కుమార్‌, జనరల్‌ మేనేజర్లు శ్రీనివాస్‌, వెంకట కృష్ణ, హనుమకొండ ఎస్‌ఈ పి.మధుసూదన్‌ రావు, సీనియర్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ నవీన్‌ కుమార్‌, డీఈలు విజయేందర్‌ రెడ్డి, జి. సాంబరెడ్డి, యూనియన్‌ బ్యాంకు ఏజీఎంలు వై.శ్రీకాంత్‌ కుమార్‌, మహేశ్‌, చీఫ్‌ మేనేజర్‌ పి.వి.చైత్యన్య రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

టీజీఎన్పీడీసీఎల్‌ సీఎండీ వరుణ్‌ రెడ్డి

అధికారులతో జాతరలో విద్యుత్‌ పనుల పురోగతిపై సమీక్ష

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement