‘గుర్తు’కు మొదటి అక్షరమే ఆధారం
హన్మకొండ అర్బన్ : గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థులుగా పోటీచేసే వారికి అధికారులు ఈ విధంగా గుర్తులు కేటాయిస్తారు. నామినేషన్‌న్‌పత్రాల పేరులోని మొదటి అక్షరం ఆధారంగానే అభ్యర్థులకు గుర్తులు కేటాయిస్తారు. ఉదాహరణకు ‘అ’ అనే పేరుతో నామినేషన్ వేసిన అభ్యర్థికి అంతకు తర్వాత వచ్చే అక్షరం కంటే ముందు గుర్తును కేటాయిస్తారు. అంటే పేరుకు ముందు ఉండే అక్షరం మేరకు గుర్తుల కేటాయింపు ఉంటుంది.
శబరిమల రైళ్ల పొడిగింపు
కాజీపేట రూరల్: అయ్యప్ప మాలధారుల సౌకర్యార్థం ప్రవేశపెట్టిన శబరిమల ప్రత్యేక రైళ్లను పొడిగించినట్లు బుధవారం దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎ.శ్రీధర్ తెలిపారు. 2026 జనవరి 3వ తేదీన సిర్పూర్‌కాగజ్‌నగర్–కొల్లం (07117) ఎక్స్‌ప్రెస్, 2026 జనవరి 5వ తేదీన కొల్లం–చర్లపల్లి (07118) ఎక్స్‌ప్రెస్ వరంగల్ మీదుగా ప్రయాణించనున్నాయి. 2026 జనవరి 3వ తేదీన వరంగల్, కాజీపేట మీదుగా కొల్లం–చర్లపల్లి (17125) రైలును పొడిగించి నడిపిస్తున్నారు. ఈ రైలుకు కాయన్‌కుళం, చెంగనూర్, తిరువల, కొట్టాయం, ఎర్నాకులం, అలువా, త్రిశూరు, పాలక్కడ్, పొదనూర్, తిరుపూర్, ఈరోడ్, సేలం, జోలెర్‌పెట్టయ్, కట్‌పడి, చిత్తూరు, పాకల్, తిరుపతి, రేణిగుంట, నెల్లూరు, ఒంగోలు, చీరాల, బాపట్ల, తెనాలి, విజయవాడ, ఖమ్మం, డోర్నకల్, మహబూబాబాద్, కేసముద్రం, వరంగల్, కాజీపేట, జనగామ, భువనగిరిలో హాల్టింగ్ కల్పించారు.
నారుమడికి నీరు
పారించడానికి వెళ్లి..
● తూములో పడి యువకుడి మృతి
● మాటేడు శివారులో ఘటన
తొర్రూరు రూరల్: నారుమడికి నీరు పారించడానికి వెళ్లిన ఓ యువకుడు ప్రమాదవశాత్తు తూములో పడి మృతి చెందా డు. ఈ ఘటన బుధవారం మండలంలోని మాటేడు శివారు బండమీద తండాలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. తండాకు చెందిన జాటోత్ సురేశ్(38) తన కుమారుడు హరికృష్ణ, తండ్రి బాలుతో కలిసి నారుమడికి నీరుపారించడానికి మాటేడు పెద్ద చెరువు బొంతుపల్లి తూము వద్దకు వెళ్లాడు. తూము తెరుస్తున్న క్రమంలో వరద ఉధృతికి కొట్టుకుపోయి పక్కన ఉన్న ము ళ్ల పొదల్లో చిక్కుకుని మృతి చెందాడు. స్థానికులు సురేశ్ మృతదేహాన్ని తూము నుంచి బయటకు తీ శారు. మృతుడి భార్య లలిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ద ర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఉపేందర్ తెలిపారు.
‘గుర్తు’కు మొదటి అక్షరమే ఆధారం


