ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి
● టీఎస్‌ఈఈయూ–327
రాష్ట్ర సెక్రటరీ జనరల్ ఇనుగాల శ్రీధర్
హన్మకొండ: విద్యుత్ ఎమ్మార్టీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్–327 రాష్ట్ర సెక్రటరీ జనరల్ ఇనుగాల శ్రీధర్ అన్నారు. హనుమకొండ వడ్డేపల్లి రోడ్డులోని టీఎస్‌ఈఈయూ–327 కార్యాలయం (పల్లా రవీందర్‌రెడ్డి భవన్)లో ఆ యూనియన్ ఉమ్మడి వరంగల్ జిల్లాస్థాయి ఎమ్మార్టీ విద్యుత్ ఉద్యోగుల సమావేశం బుధవారం జరిగింది. ఈ సమావేశంలో ఇనుగాల శ్రీధర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ఎమ్మార్టీ ఉద్యోగులకు పదోన్నతి చానల్ పెంచేందుకు చేసిన కృషి ఫలించిందన్నారు. జూనియర్ లైన్‌మెన్లకు అసిస్టెంట్ లైన్‌మెన్లుగా పదోన్నతి లభించే అవకాశం వచ్చిందన్నారు. ఈ మేరకు ఎన్పీడీసీఎల్ యాజమాన్యం ఎమ్మార్టీ విభాగంలో కొత్తగా అసిస్టెంట్ లైన్‌మెన్ పోస్టులు మంజూరు చేసిందని పేర్కొన్నారు. అనంతరం తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్–327 ఎమ్మార్టీ విభాగం ఉమ్మడి వరంగల్ జిల్లా కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా పి.సారంగపాణి, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఆ ర్.శ్రీనివాస్, ఉపాధ్యక్షులుగా ఎస్.శోభారాణి, యు.రవీందర్, ఎం.శ్రీదేవి, కార్యదర్శిగా కె.రాజు, సంయుక్త కార్యదర్శులు గా ఆర్.ప్రణయిత, ఎన్.వనజ, డి.సుజాత, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా పి.అంబేడ్కర్, ఆర్.హరి, ఎస్.కమలాకర్, జా కీర్, కోశాధికారిగా జె.విద్యాసాగర్ ఎన్నికయ్యారు. టీఎస్‌ఈఈయూ టీజీ ఎన్పీడీసీఎల్ శాఖ అధ్యక్షుడు పి.మహేందర్ రెడ్డి, హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దొనికల సదయ్య, కార్యదర్శి చిట్ల ఓదెలు, ఎమ్మార్టీ ఉద్యోగులు పాల్గొన్నారు.


