బ్యాంకుల్లో రద్దీ..
డోర్నకల్: గ్రామపంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కొత్తగా బ్యాంకు ఖాతా తెరవాలనే నిబంధనతో బ్యాంకులు రద్దీగా మారాయి. మండలంలో మూడో విడత గ్రామ పంచాయ తి ఎన్నికలకు సంబంధించి బుధవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. కాగా అభ్యర్థులు కొత్తగా బ్యాంక్ ఖాతా తెరవాలనే నిబంధన ఉండడంతో పోటీ చేసేందుకు ఉత్సాహం చూపుతున్న ఆశావహులు బ్యాంకుల బాట పడుతున్నారు. దీంతో డోర్నకల్‌లోని పలు బ్యాంకులు బిజీగా మారాయి. మండలంలో 26 గ్రామపంచాయతీలు, 218 వార్డులు ఉండగా ఎన్నికల్లో భారీ సంఖ్యలో పోటీ చేస్తున్న వారు అకౌంట్ కోసం బ్యాంకుల్లో క్యూ కడుతున్నారు.
డీఈఓకు సన్మానం
మహబూబాబాద్ అర్బన్: జిల్లా విద్యాశాఖ అధికారిగా బాధ్యతలు చేపట్టిన వి.రాజేశ్వర్‌ను మంగళవారం టీఎన్‌జీఓఎస్ జిల్లా అధ్యక్షుడు గణేశ్, ప్రధాన కార్యదర్శి ముజాహిద్ అలీ, డీఈఓ కార్యాలయ ఉద్యోగులు, సిబ్బంది మ ర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపి సన్మానించారు. కార్యక్రమంలో అసోసియేట్ అధ్యక్షుడు సీహెచ్. శ్రీనివాస్, జిల్లా నాయకులు ఎస్‌బీ.శ్రీనివాస్, ఉమామహేశ్వర్‌రావు, రమేశ్, జీసీడీఓ విజయ కుమారి పాల్గొన్నారు.
అభ్యర్థుల ఎన్నికల వ్యయంపై నిఘా
తొర్రూరు: పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల ఎన్నికల వ్యయంపై నిఘా ఉంచుతామని జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకుడు ఏ.శ్రీనివాసరావు తెలిపారు. డివిజన్ కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. పంచాయతీ రాజ్ చట్టం అభ్యర్థులకు నిర్ణీత వ్యయ పరిమితిని విధించిందని, అది దాటితే చర్యలు తీసుకుంటామన్నారు. సర్పంచ్ అభ్యర్థులు రూ.1.50 లక్షలు, వార్డు అభ్యర్థులు రూ.30 వేల వరకు ఖర్చు చేయాలన్నారు. వ్యయాన్ని ప్రత్యేక ఖాతా ద్వారానే నిర్వహించాలని సూచించారు. నామినేషన్ మొదలు ప్రచారం ముగిసేవరకు అభ్యర్థుల వ్యయాలను పరిగణనలోకి తీసుకుంటామన్నారు. సమావేశంలో తహసీల్దార్ గడీల శ్రీనివాస్, ఎంపీడీఓ కూస వెంకటేశ్వర్లు, డీటీ నర్సయ్య, ఆడిట్ అధికారి వీరూనాయక్ తదితరులు పాల్గొన్నారు.
నిబంధనలు ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు
తొర్రూరు: నిబంధనలు ఉల్లఘించి వాహనాలు నడిపితే లైసెన్స్ రద్దు చేస్తామని జిల్లా రవాణా శాఖ సహాయ అధికారి శీలం వెంకట్‌రెడ్డి తెలిపారు. డివిజన్ కేంద్రంలో మంగళవారం రవాణా శాఖ అధికారులు తనిఖీ చేపట్టారు. అధిక లోడు, అతి వేగంతో రోడ్డుపైకి వచ్చిన ట్రాక్టర్లు, ఇతర వాహనాలను తనిఖీ చేశారు. లెసెన్స్‌లు, పర్మిట్లు, ఇన్సూరెన్స్, ధ్రువ పత్రాలను పరిశీలించారు. సరైన పత్రాలు లేని 4 ట్రాక్టర్లు, ఒక ట్రాలీని సీజ్ చేశారు.
కాంగ్రెస్ పార్టీకి ఎదురులేదు
మహబూబాబాద్ రూరల్ : కాంగ్రెస్ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని, జిల్లాలో పార్టీకి ఎదురులేదని డీసీసీ అధ్యక్షురాలు భూక్య ఉమ అన్నారు. హైదరాబాద్ గాంధీ భవన్‌లో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం మంగళవారం నిర్వహించారు. ఏఐ సీసీ రాష్ట్ర ఇన్‌చార్జ్ మీనాక్షినటరాజన్, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, పార్టీ సీనియర్ నాయకులు హాజరుకాగా.. డీసీసీ అధ్యక్షురాలు భూ క్య ఉమ పాల్గొన్నారు. నూతనంగా డీసీసీ అధ్యక్షురాలిగా ఎన్నికై న ఆమెకు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ చేతులమీదుగా నియామక పత్రం అందజేశారు.ఉమ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నా రు. జిల్లాలో బూ త్ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పార్టీ నాయకత్వాన్ని బలోపేతం చేయడంతో పాటు అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తానని పేర్కొన్నారు.
బ్యాంకుల్లో రద్దీ..
బ్యాంకుల్లో రద్దీ..
బ్యాంకుల్లో రద్దీ..


