40ఏళ్లు ఒక్కరే సర్పంచ్‌! | - | Sakshi
Sakshi News home page

40ఏళ్లు ఒక్కరే సర్పంచ్‌!

Dec 3 2025 9:41 AM | Updated on Dec 3 2025 9:41 AM

40ఏళ్లు ఒక్కరే సర్పంచ్‌!

40ఏళ్లు ఒక్కరే సర్పంచ్‌!

సాక్షి, మహబూబాబాద్‌ : ఒకసారి ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన నాయకుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఐదేళ్లు పూర్తిగా పనిచేస్తారో లేదో తెలియని పరిస్థితి. కానీ, ఏకంగా నాలుగు దశాబ్దాలపాటు తిరుగులేని స ర్పంచ్‌గా రికార్డు సృష్టించారు మహబూబాబాద్‌ జి ల్లా నర్సింహులపేట గ్రామ మాజీ సర్పంచ్‌ నాయి ని మనోహర్‌ రెడ్డి. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 1952లో జరిగిన ఎన్నికల్లో గ్రామ తొలి సర్పంచ్‌గా చెక్కల చంద్రారెడ్డి గెలిచారు. ఆయన మూడేళ్లు పని చేసిన తర్వాత 1955లో నాయిని మనోహర్‌ రెడ్డి సర్పంచ్‌గా నియమితులయ్యారు. అప్పటినుంచి వ రుసగా గెలుస్తూ.. 1995 వ రకు ఆయనే సర్పంచ్‌గా పనిచేశారు. పోటీ చేసిన ప్రతీసారి మనోహర్‌ రెడ్డి గెలుపొందారు. చివరకు వయస్సు మీద పడడంతో పోటీనుంచి తప్పుకుని మరో నాయకుడికి సర్పంచ్‌గా అవకాశం కల్పించారు ఆ గ్రామస్తులు. సౌమ్యుడిగా పేరున్న మనోహర్‌ రెడ్డి ఎన్నికల సమయంలో తప్ప.. మిగిలిన సమయంలో అన్ని వర్గాలతో మమేకమే ఉండటం.. గ్రామంలో ఎలాంటి గొడవలకు తావులేకుండా చూడడం ఆయన ప్రత్యేకత. అందుకోసమే ఇప్పటికీ ఆ గ్రామంనుంచి పోలీస్‌ స్టేషన్‌లో కేసులు పెట్టేందుకు గ్రామస్తులు ఇష్టపడరని.. అది ఆయన గ్రామస్తులకు నేర్పించిన మంచితనంగా గ్రామస్తులు చెప్పుకుంటారు.

పోటీచేసిన ప్రతీసారి గెలుపే

విరమణ తర్వాతనే మరో సర్పంచ్‌

రికార్డు సృష్టించిన మహబూబాబాద్‌ జిల్లా

నర్సింహులపేట సర్పంచ్‌ నాయిని మనోహర్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement