సామర్థ్యం పెంపుతో నాణ్యమైన విద్యుత్
డోర్నకల్: విద్యుత్ సబ్‌స్టేషన్ల సామర్థ్యం పెంచుతూ నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసేందుకు కృషి చేస్తున్నట్లు విద్యుత్‌శాఖ ఎస్‌ఈ విజేందర్‌రెడ్డి తెలిపారు. మండలంలోని తొడేళ్లగూడెం గ్రామ విద్యుత్ సబ్‌స్టేషన్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన 5 ఎంవీఏ పవర్ ట్రాన్స్‌ఫార్మర్‌ను మంగళవారం ఎస్‌ఈ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 5 ఎంఈఏ పీటీఆర్ ఏర్పాటుతో తొడేళ్లగూడెం పరిసరాల్లో మెరుగైన విద్యుత్ సరఫరాతో పా టు సమస్యలు పరిష్కారమవుతాయని అన్నారు. ట్రాన్స్‌ఫార్మర్‌ను సమర్థవంతంగా అమర్చిన విద్యుత్ సిబ్బందిని అభినందించారు. కార్యక్రమంలో డీఈ(టెక్నికల్) హీరాలాల్, డీఈ ఎంఆర్‌టీ సునీతాదేవి, ఏడీఈలు రమేశ్, భీమాసింగ్, లోక్‌నాథ్, ఏఈలు కిరణ్, క్రాంతికుమార్ పాల్గొన్నారు.


