వేంను కలిసిన ఎమ్మెల్యే దంపతులు
మహబూబాబాద్ రూరల్ : సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డిని ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళీనాయక్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియమితులైన డాక్టర్ భూక్య ఉమ హైదరాబాద్‌లో మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వేం నరేందర్ రెడ్డిని డాక్టర్ ఉమ శాలువాతో సన్మానించి బొకే అందజేయగా ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
మరిపెడ పీఎస్ తనిఖీ
మరిపెడ: మరిపెడ పోలీస్‌స్టేషన్‌ను మంగళవారం నూతన ఎస్పీ శబరీష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. తొలిసారిగా వచ్చిన ఆయన రికార్డులను పరిశీలించారు. స్టేషన్ ఆవరణను పరిశీలించి నూతనంగా నిర్మించే పోలీస్‌స్టేషన్ గురించి అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా పోలీసులకు పలు సూచనలు చేశారు. సీఐ రాజ్‌కుమార్‌గౌడ్, ఎస్సై వీరభద్రరావు, కోటేశ్వరరావు తదితరులు ఉన్నారు. అలాగే సీరోలు మండలంలోని పోలీస్‌స్టేషన్‌ను ఎస్పీ శబరీష్ తనిఖీ చేశారు. ఆయన వెంట ఎస్సై సంతోష్ ఉన్నారు.
అమృత్ పనులు
పూర్తి చేయాలి
డోర్నకల్: డోర్నకల్ మున్సిపాలిటీ పరిధిలోని మూడు ప్రాంతాల్లో అమృత్ ట్యాంకుల నిర్మాణంతో పాటు పైపులైన్ పనులు సకాలంలో పూర్తి చేయాలని రీజనల్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ షాహీద్ మసూద్ ఆదేశించారు. మున్సిపాలిటీలో జరుగుతున్న అమృత్ పనులను పరిశీలించిన ఆర్‌డీఎంఏ పనుల పురోగతిపై సమీక్ష జరిపారు. అమృత్ పనులను సకాలంలో పూర్తి చేయాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నిరంజన్, ఏఈ శృతి సిబ్బంది పాల్గొన్నారు.
చర్చనీయాంశంగా
ఫ్లెక్సీ ఏర్పాటు
● సర్పంచ్‌గా గెలిపిస్తే సేవచేస్తా
కేసముద్రం: సర్పంచ్‌గా గెలిపిస్తే నాయకుడిగా కాదు.. సేవకుడిగా పనిచేస్తానంటూ మండలంలోని అర్పనపల్లి గ్రామంలో బుడిగబోయిన శృతి, అశోక్ దంపతుల పేరుతో మంగళవారం ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. గ్రామ పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్ అధికారికంగా ప్రకటించిన నేపథ్యంలో ‘నా గ్రామ అభివృద్ధే లక్ష్యం, నా గ్రామ శ్రేయస్సే నా ధ్యేయం..’ సర్పంచ్‌గా గెలిపిస్తే గ్రామానికి చేసే సేవలను తెలుపుతూ, ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
హేమాచలక్షేత్రంలో భక్తుల సందడి
మంగపేట: ములుగు జిల్లా మంగపేట మండల పరిధిలోని మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో మంగళవారం భక్తుల సందడి నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. అత్యంత భక్తిశ్రద్ధలతో స్వామివారిని దర్శంచుకున్నారు.
వేంను కలిసిన ఎమ్మెల్యే దంపతులు
వేంను కలిసిన ఎమ్మెల్యే దంపతులు
వేంను కలిసిన ఎమ్మెల్యే దంపతులు
వేంను కలిసిన ఎమ్మెల్యే దంపతులు


