టెట్ నుంచి మినహాయించాలి
తొర్రూరు: ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులను టెట్ నుంచి మినహాయించాలని యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు మురళీకృష్ణ కోరారు. ఈ మేరకు యూటీఎఫ్ ఆధ్వర్యంలో మంగళవారం డివిజన్ కేంద్రం నుంచి ప్రధాని కార్యాలయానికి ఈ–మెయిల్ వినతిపత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా మురళీకృష్ణ మాట్లాడుతూ.. 2010 కన్నా ముందు సర్వీస్‌లో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ పరీక్ష నుంచి మినహాయింపు ఇవ్వాలన్నారు. టెట్ విషయంలో ఉపాధ్యాయులకు ఎదురవుతున్న సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని, టెట్ అవసరం లేకుండా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయులుగా కొలువులు సాధించిన వారిని టెట్ రాయాలనడం హాస్యాస్పదమన్నారు. నాయకులు రమేశ్, వెంకటేశ్వర్లు, జనార్దన్, వెంకన్న, చైతన్య, పార్వతీరాథోడ్, వంశీకృష్ణ, రంజిత్‌కుమార్, రజినీకాంత్ పాల్గొన్నారు.
మినహాయింపు ఇవ్వాలి
మహబూబాబాద్: కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి సీనియర్ టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు ఇచ్చేలా పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో చట్టం చేయాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి మల్లారెడ్డి అన్నారు. టీఎస్ యూటీఎఫ్ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక ప్రధాన తపాలా కార్యాలయం నుంచి ప్రధానమత్రికి పోస్టు, ఈ– మెయిల్ ద్వారా వినతులు పంపారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ.. సర్వీస్‌లో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో యాకూబ్, మంజుల తదితరులు పాల్గొన్నారు


