
కొనసాగుతున్న పంపింగ్
కన్నాయిగూడెం: ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెం గ్రామపంచాయతీ పరిఽధిలో ఉన్న దేవాదుల జె. చొక్కారావు పంపింగ్ కొనసాగుతోంది. పంపింగ్ కొన్ని రోజుల నుంచి నిలిచింది. ఈ క్రమంలో మంగళవారం పంపింగ్ వద్ద ఉన్న మూడు ఫేజ్‌ల్లోని పది మోటార్లలో ఫేజ్ టులో– 2 , ఫేజ్ త్రీలో 2 మోటార్లను ఆన్ చేసి నీటిని దిగువన ఉన్న గొల్లబెద్దారం రిజర్వాయర్‌లోకి పంపింగ్ చేస్తున్నారు. నాలుగు మోటార్లతో 831 క్యూసెక్కుల నీటిని పంపింగ్ చేస్తున్నట్లు ఇంజనీరింగ్ అధికారులు తెలిపారు. ప్రస్తుతం పంపింగ్ వద్ద 78.30 మీటర్ల నీటిమట్టం కొనసాగుతోంది. సమ్మక్క సాగర్ బ్యారేజీలోకి ఎగువ నుంచి 3,17,480 క్యూసెక్కులు చేరుతుండడంతో 59 గేట్లు ఎత్తి దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం బ్యారేజీ వద్ద 77.45 మీటర్ల నీటి మట్టం కొనసాగుతోంది