
ఒంటరి మహిళలే టార్గెట్
వరంగల్ క్రైం: రోడ్లపై ఒంటరిగా వెళ్తున్న మహిళలను లక్ష్యంగా చేసుకొని వారి మెడలో నుంచి చైన్‌స్నాచింగ్‌తోపాటు ద్విచక్రవాహనాల చోరీకి పాల్ప డుతున్న నిందితుడిని పోలీసులు అరెస్టు చేసినట్లు సీపీ సన్‌ప్రీత్ సింగ్ తెలిపారు. నిందితుడి నుంచి రూ.23.5 లక్షల విలుౖవైన బంగారు ఆభరణాలు, మూడు ద్విచక్ర వాహనాలు, రూ.10 వేల నగదు, ఒక సెల్‌ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీపీ వివరాలు వెల్లడించారు.
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం దామెర ప్రాంతానికి చెందిన మంతుర్తి హరీశ్ హైదరాబాద్‌లోని ఓ సిమెంట్ కంపెనీలో క్వాలిటీ టెక్నీషియన్‌గా పనిచేసేవాడు. కాగా, అదే కంపెనీలో పనిచేస్తున్న ఓ ఇంజనీర్ ఇంటిలో బంగారు గొలుసు చోరీ చేసి గోల్డ్‌లోన్ కంపెనీలో తాకట్టు పెట్టాడు. వచ్చిన డబ్బుతో నిందితుడు జల్సాలు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ సంఘటనలో నిందితుడిని స్థానిక నేరెడ్‌మెట్ పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు. బెయిల్‌పై విడుదలైన నిందితుడిలో ఎలాంటి మార్పు రాలేదు. మళ్లీ చైన్ స్నాచింగ్‌లకు పాల్ప డి వాటిని అమ్మగా వచ్చిన డబ్బుతో జల్సాలు చేసినట్లు సీపీ వివరించారు. నిందితుడు ముందుగా ద్విచక్ర వాహనాన్ని చోరీ చేస్తాడు. దానిపై వెళ్లి చైన్ స్నాచింగ్‌లకు పాల్పడినట్లు ఆయన తెలిపారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 10 చైన్ స్నాచింగ్‌లు, మూడు ద్విచక్ర వాహనాలు చోరీ చేశాడని పేర్కొన్నారు.
అప్రమత్తమైన పోలీసులు..
చైన్ స్నాచింగ్‌లపై అప్రమత్తమైన పోలీసులు పక్కా సమాచారంతో మంగళవారం ఉదయం యాదవ్‌నగర్ క్రాస్ వద్ద తనిఖీలు చేపట్టారు. అనుమానాస్పదంగా ద్విచక్ర వాహనంపై వస్తున్న నిందితుడు తప్పించుకొని పారిపోగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చైన్ స్నాచింగ్, ద్విచక్రవాహనాలను చోరీ చేసినట్లు అంగీకరించినట్లు ఆయన తెలిపారు. నిందితుడు ఇచ్చిన సమాచారంతో హనుమకొండ రెడ్డి కాలనీలోని అద్దె ఇంటిలో పోలీసులు మిగిలిన చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు సీసీ వివరించారు.
అధికారులకు అభినందనలు..
నిందితుడిని పట్టుకోవడంలో ప్రతిభ కబరిచిన క్రైం డీసీపీ గుణశేఖర్, క్రైం ఏసీపీ సదయ్య, హనుమకొండ ఏసీపీ నర్సింహారావు, కేయూ, సీసీఎస్ ఇన్‌స్పెక్టర్లు రవికుమార్, రాఘవేందర్, ఏఏఓ సల్మాన్ పాషా, సీసీఎస్ ఎస్సైలు రాజ్‌కుమార్, శివకుమార్, హెడ్‌కానిస్టేబుళ్లు అంజయ్య, జంపయ్య, కానిస్టేబు ళ్లు మధుకర్, చంద్రశేకర్, రాములు, నగేశ్‌ను పోలీస్ కమిషనర్ అభినందించారు.
ఆభరణాలు, వాహనాలను చోరీ చేస్తున్న వ్యక్తి అరెస్ట్
రూ.23.5 లక్షల విలువైన బంగారు నగలు స్వాధీనం
వివరాలు వెల్లడించిన వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్

ఒంటరి మహిళలే టార్గెట్