
కాజీపేట–బల్లార్షా మధ్య రైల్వే ఎన్‌ఐ వర్క్స్
కాజీపేట రూరల్: కాజీపేట సబ్ డివిజన్ పరిధిలోని హసన్‌పర్తి–ఉప్పల్–జమ్మికుంట,కాజీపేట–బల్లార్షా సెక్షన్‌లో ప్రీ ఇంటర్‌లాకింగ్ అండ్ నాన్ ఇంటర్‌లాకింగ్ ఆటోమెటిక్ బ్లాక్ సిగ్నలింగ్ వర్క్స్‌తో పలు ప్యాసింజర్ రైళ్లు రద్దు, పలు ప్యాసింజర్ రైళ్లు తాత్కాలిక రద్దు, మరికొన్ని రైళ్ల హాల్టింగ్ ఎత్తివేత, కొన్ని రైళ్లను రెగ్యులేషన్ చేసి నడిపించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎ.శ్రీధర్ మంగళవారం తెలిపారు.
ప్యాసింజర్ రైళ్ల రద్దు వివరాలు
ఆగస్టు 29వ తేదీన కాజీపేట–సిర్పూర్‌టౌన్ (17003) ప్యాసింజర్, బల్లార్షా–కాజీపేట (17004) ప్యాసింజర్, బల్లార్షా– కాజీపేట (17036) ప్యాసింజర్, ఆగస్టు 28వ తేదీన కాజీపేట–బల్లార్షా (17035) ప్యాసింజర్లను రద్దు చేయనున్నారు.
తాత్కాలిక రద్దు..
ఆగస్టు 29వ తేదీన భద్రాచలం రోడ్డు–బల్లార్షా (17033) సింగరేణి కాజీపేట–బల్లార్షా మధ్య రద్దు, సిర్పూర్‌టౌన్ –భద్రాచలం రోడ్డు (17034) సింగరేణి సిర్పూర్‌టౌన్ –కాజీపేట మధ్య రద్దు, ఆగస్టు 28వ తేదీన సికింద్రాబాద్–సిర్పూర్ కాగజ్‌నగర్ (17233) కాగజ్‌నగర్ ఎక్స్‌ప్రెస్ కాజీపేట–సిర్పూర్‌కాగజ్‌నగర్ మధ్య రద్దు, ఆగస్టు 29వ తేదీన సిర్పూర్ కాగజ్‌నగర్–సికింద్రాబాద్ (17234) సిర్పూర్ కాగజ్‌నగర్ ఎక్స్‌ప్రెస్‌ను సిర్పూర్ కాగజ్‌నగర్–కాజీపేట మధ్య రద్దు చేసినట్లు తెలిపారు.
తాత్కాలిక హాల్టింగ్ ఎత్తివేత..
ఆగస్టు 29వ తేదీన హైదరాబాద్–సిర్పూర్‌కాగజ్‌నగర్ (17011) ఎక్స్‌ప్రెస్, సిర్పూర్‌కాగజ్‌నగర్–బీదర్ (17012) ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్–సిర్పూర్‌కాగజ్‌నగర్ (12757) ఎక్స్‌ప్రెస్‌లకు ఉప్పల్, జమ్మికుంట రైల్వే స్టేషన్లలో తాత్కాలికంగా హాల్టింగ్ ఎత్తివేశారు.
రెగ్యులేషన్ ట్రైన్స్..
ఆగస్టు 29వ తేదీన రక్సోల్–చర్లపల్లి (07006) ఎక్స్‌ప్రెస్‌ను 75 నిమిషాలు, లక్నో–ఎంజీఆర్ చైన్నె సెంట్రల్ ఎక్స్‌ప్రెస్ (16094) ఎక్స్‌ప్రెస్‌ను 45 నిమిషాలు, సిర్పూర్‌కాగజ్‌నగర్–సికింద్రాబాద్ (12758) ఎక్స్‌ప్రెస్‌ను 30 నిమిషాల పాటు రెగ్యులేషన్ చేసి నడిపించనున్నట్లు సీపీఆర్వో తెలిపారు.
నాలుగు ప్యాసింజర్ రైళ్లు రద్దు
నాలుగు రైళ్ల తాత్కాలిక రద్దు