
మంచం పట్టిన బాలికకు చేయూత..
కేసముద్రం: మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం పెనుగొండ గ్రామానికి చెందిన చెవుగాని మహేశ్ కూతురు సుష్మ అనారోగ్యంతో 9 ఏళ్లుగా మంచం పట్టింది. దీంతో బాలిక కుటుంబ దీనస్థితిని తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి హైదరాబాద్‌లో ఆ బాలిక తండ్రికి మంగళవారం రూ.3లక్షల ఆర్థిక సాయం అందజేశారు. వివరాలు ఇలా ఉన్నాయి.. సుష్మ 9 సంవత్సరాల వయసులో దసరా పండుగకు అమ్మమ్మ ఇంటికి వెళ్లింది. అక్కడ చీమల మందు కలిసిన చపాతీ తినడంతో తీవ్ర అనారోగ్యానికి గురైంది. అప్పటి నుంచి మంచానికే పరిమితమైంది. ఆర్థిక స్థోమత లేకపోవడంతో మహేశ్ తన కూతురును ఆస్పత్రుల్లో చూపించలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. ఈ క్రమంలో ఇటీవల మహేశ్ తన కూతురి పరిస్థితిని గాంధీభవన్ మీడియాకు తెలుపగా వారు జగ్గారెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వెంటనే స్పందించిన జగ్గారెడ్డి బాలిక తండ్రిని తన ఇంటికి పిలిపించుకుని, రూ.3లక్షల ఆర్థిక సాయం అందించారు. ‘నేనున్నా.. అధైర్యపడొద్దు’ అని భరోసా బాధిత కుటుంబానికి కల్పించారు. ఆ వెంటనే డాక్టర్ చంద్రశేఖర్‌తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వమే వైద్య ఖర్చులను భరించేలా చూస్తానన్నారు.
వైద్యఖర్చుల కోసం రూ.3 లక్షల
అందజేసిన మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి

మంచం పట్టిన బాలికకు చేయూత..