
పర్యాటకుడిని సురక్షితంగా తీసుకొచ్చిన అధికారులు
వెంకటాపురం(కె): మండలంలోని వీరభద్రవరం గ్రామ సమీపంలోని ముత్యం ధార జలపాతం సందర్శనకు వెళ్లి అటవీ ప్రాంతంలో చిక్కుకున్న పర్యాటకుడిని అటవీశాఖ అధికారులు సురక్షితంగా తీసుకొచ్చారు. వరంగల్‌కు చెందిన అబ్రార్ సోమవారం బొగత జలపాతం సందర్శనకు వెళ్లాడు. తిరిగొచ్చే క్రమంలో కాలుకు గాయం కావడంతో నడవలేక అ టవీ ప్రాంతంలోనే చిక్కుకున్నాడు. దీంతో రాత్రి డ యల్ 100కు కాల్ చేసి వివరాలు తెలిపాడు. వి షయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు తెల్ల వారుజామున అబ్రార్‌ను గుర్తించి సురక్షితంగా తీసుకొచ్చారు. అనంతరం తల్లిదండులను పిలిచి వారి సమక్షంలో అబ్రార్‌కు కౌన్సెలింగ్ ఇచ్చి అప్పగించినట్లు అధికారులు తెలిపారు.