
నానో యూరియా వాడకంతో ప్రయోజనాలు
తొర్రూరు/చిన్నగూడూరు: పంటలకు నానో యూరియా వాడాలని డీఏఓ విజయనిర్మల తెలిపా రు. తొర్రూరు పీఏసీఎస్, చిన్నగూడూరు మండలం ఉగ్గంపల్లి రైతువేదికలో సోమవారం యూరియా పంపిణీని వ్యవసాయాధికారులు పరిశీలించారు. వ్యవసాయ శాఖ సంచాలకులు విజయ్‌చంద్రతో కలిసి డీఏఓ నానో యూరియాపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎకరాకు 500 మిల్లీ లీటర్ల నానో యూరియా వేయడం వల్ల పంటకు కావాల్సిన నత్రజని సమర్థవంతంగా అందుతుందని తెలిపారు. కార్యక్రమంలో తొర్రూరు తహసీల్దార్ శ్రీనివాస్, ఏఓ రాంనర్సయ్య, అదనపు ఎస్సై శివరామకృష్ణ, ఏఈఓలు ఆమని, జమున, మానస, దీపిక, వినయ్‌వర్మ, భరత్‌చంద్ర, పీఏసీఎస్ సీఈఓ మురళి, చిన్నగూడూరు మండల వ్యవసాయ అధికారి భాస్కర్, ఏఈఓ శిరీష, రైతులు పాల్గొన్నారు