
రుచికరమైన భోజనం అందించాలి
● కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్
మహబూబాబాద్ అర్బన్: విద్యార్థులకు మెనూ ప్రకారం రుచికరమైన భోజనం అందించాలని కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్‌ను సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేసి, వంట, తరగతి గ దులు, డైనింగ్ హాల్, మరుగుదొడ్లు, పరిసరాలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు రుచికరమైన భోజనం అందించాలని వంట నిర్వాహకులను ఆదేశించారు. భోజనం సిద్ధం చేసే సమయంలో పలు జాగ్రత్తలు పాటించాలన్నారు. విద్యార్థులకు షెడ్యూల్ ప్రకారం ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని వైద్య సిబ్బందికి సూచించారు. సబ్జెక్ట్‌ల వారీగా విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను గుర్తించి డిజిటల్ తరగతులు, ఏఐ ద్వారా బోధన చేపట్టాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. అనంతరం గుమ్ముడూరు ప్రాథమిక పాఠశాలను సందర్శించి విద్యార్థులు, ఉపాధ్యాయులతో మాట్లాడారు. ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, స్వచ్ఛమైన తాగునీరు అందించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో తెలంగాణ సోషల్ వెల్ఫ్‌ర్ డీసీఓ జాక్లిన్, పాఠశాల హెచ్‌ఎం హల్యానాయక్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.