
వెంటాడుతున్న యూరియా కష్టాలు
మహబూబాబాద్ రూరల్ : యూరియా కష్టాలు రైతులను వెంటాడుతూనే ఉన్నాయి. మహబూబాబాద్ పట్టణంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఎదుట సోమవారం యూరియా బస్తాల కోసం రైతులు ఎండలో సైతం క్యూలో నిలబడి తమ పేర్లు నమోదు చేయించుకున్నారు. అనంతరం తమ ఇళ్లకు వెళ్లిపోయారు. ఈనెల 22న పేర్లు నమోదు చేయించుకున్న రైతులను క్రమపద్ధతిలో పిలుస్తూ జెడ్పీ సీఈఓ పురుషోత్తం, ఏడీఏ శ్రీనివాసరావు, ఏఓ తిరుపతిరెడ్డి, తహసీల్దార్ చంద్రరాజేశ్వరరావు, పీఏసీఎస్ చైర్మన్ నాయిని రంజిత్, సీఈఓ ప్రమోద్ యూరియా బస్తాలు పంపిణీ చేశారు. టౌన్ సీఐ మహేందర్ రెడ్డి, రూరల్ సీఐ సర్వయ్య ఆధ్వర్యంలో ఎసైలు శివ, సూరయ్య, మౌనిక, పోలీసు సిబ్బంది బందోబస్తు నిర్వహించారు.