
మతసామరస్యాన్ని పెంపొందించుకోవాలి
● డీఎస్పీ తిరుపతిరావు
మహబూబాబాద్ రూరల్: వినాయక చవితి, మిలాద్ ఉన్ నబీ సమీపిస్తున్న తరుణంలో మత సామరస్యాన్ని పెంపొందించుకునేందుకు పీస్ కమిటీ సభ్యులు కృషి చేయాలని డీఎస్పీ తిరుపతిరావు కోరారు. జిల్లా శాంతి, సంక్షేమ కమిటీ (పీస్ కమిటీ) సభ్యులతో మహబూబాబాద్ టౌన్ పో లీస్ స్టేషన్‌లో శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుపతిరావు సజావుగా పండుగలు నిర్వహించుకోవడానికి తీసుకునే చర్యలపై చర్చించారు. పోలీసులకు ప్రజలు సహకారం అందించాలని, మత సామరస్యాన్ని బలోపేతం చేయడానికి కృషి చేయాలని కోరారు. సమావేశంలో టౌ న్ సీఐ గట్ల మహేందర్ రెడ్డి, ఎస్సైలు శివ, అశోక్, అలీం హుస్సేన్, సూరయ్య, మౌనిక పాల్గొన్నారు.