
విద్యాశాఖలో పదోన్నతుల పండుగ
● జిల్లాలో 103 మంది ఎస్జీటీలకు పదోన్నతి
● కసరత్తు చేస్తున్న విద్యాశాఖ అధికారులు
మహబూబాబాద్ అర్బన్: జిల్లాలో ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు సుధీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న పదోన్నతులకు ఎట్టకేలకు గ్రీన్‌సిగ్నల్ పడింది. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో ఎస్జీటీలుగా పనిచేస్తున్న ఉపాధ్యాయుల్లో 103 మంది స్కూల్ అసిస్టెంట్లుగా, వివిధ సబ్జెక్ట్‌ల్లో ప్రాథమిక పాఠశాల ప్రాధానోపాధ్యాయులుగా ఉద్యోగోన్నతి పొందనున్నారు. ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు ప్రమోషన్ పొందిన ఉపాధ్యాయులు రిపోర్ట్ చేస్తే మిగతావాటిని భర్తీ చేయనున్నారు. జిల్లా వ్యాప్తంగా 103 మంది ఎస్జీటీల సీనియార్టీ ఆధారంగా ఖాళీల జాబితాను అధికారులు విడుదల చేశారు. నేడు (ఆదివారం) వెబ్‌సైట్‌లో పాఠశాలలను ఎంపిక చేసుకునే అవకాశం ఉపాధ్యాయులకు కల్పించారు.
పదోన్నతుల కేటాయింపు ఇలా..
ఎస్జీటీ ఉపాధ్యాయుల నుంచి స్కూల్ అసిస్టెంట్ పదోన్నతులు పొందే వారు సీనియార్టీ ఆధారంగా జిల్లా వ్యాప్తంగా 103 మంది ఉన్నారు. 14 మంది స్కూల్ అసిస్టెంట్లు జిల్లాలో ప్రిన్సిపాళ్లుగా పదోన్నతులు పొందారు.
జిల్లా వ్యాప్తంగా ఉన్న ఎస్జీటీల ఉపాధ్యాయుల లిస్టు, సీనియార్టీ ప్రకారం వారికి వివిధ సబ్జెక్ట్‌ల వారీగా పదోన్నతులు కల్పిస్తాం. ప్రభుత్వ నింబధనలు మేరకు షెడ్యూల్ వచ్చాక పదోన్నతులు ప్రారంభిస్తాం. ఉపాధ్యాయులు పదోన్నతుల విషయంలో ఆందోళనలు చెందవద్దు.
– డాక్టర్ రవీందర్‌రెడ్డి, డీఈఓ

విద్యాశాఖలో పదోన్నతుల పండుగ